AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gruda Puranam: నేటి మనిషి మనిషిగా బతకాలంటే.. గరుడ పురాణం చదవాలి.. ఎందుకంటే

అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎంతో ప్రాధాన్యత వుంది. స్వయంగా శ్రీ మహా విష్ణువు గరుత్మంతుడి సందేహాలను తీర్చే సమాధానాలను వ్యాస మహర్షి ఈ గరుడ పురాణం లిఖించాడు. అయితే రామాయణం,మహాభారతం వంటి పురాణాలు చదివినంత ఆసక్తిగా గరుడపురాణం చదివేందుకు ఇష్టపడరు. దీనికి కారణం గరుడ పురాణం అంటే మనుషులు చేసే కర్మలను అనుసరించి ఆత్మలకు విధించే శిక్షలను తెలియజేస్తుందని నమ్మకం. అయితే మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలని మీకు తెలుసా..

Gruda Puranam: నేటి మనిషి మనిషిగా బతకాలంటే.. గరుడ పురాణం చదవాలి.. ఎందుకంటే
Garuda Puranam
Surya Kala
|

Updated on: Apr 27, 2025 | 6:52 AM

Share

గరుడపురాణం మరణించిన వారి ఇంట్లో 13 రోజుల పాటు చదువుతారు. ఇలా చేయడం వలన దేహం నుంచి విడిచిన ఆత్మ ప్రయాణం, జీవికి ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొని ఉత్తమ గతులు పొండుందని నమ్మకం. అందుకనే కొన్ని ప్రాంతాల్లో శ్రాద్ధ కర్మలను చేసే సమయంలో గరుడ పురాణం చదవడం ఆనవాయతీగా వస్తోంది. ఇలా గరుడ పురాణం పటించడం వలన మరణించిన కుటుంబానికి చెందిన వ్యక్తులు తమ కుటుంబ సభ్యునికి ఉత్తమగతులు కలగడానికి ఏమి చెయ్యాలి.. ఏమి చెయ్యకూడదు అనే విషయాలు తెలుస్తాయి. అయితే ఈ గరుడ పురాణం లో మనిషి మనిషిగా ఎలా బతకాలో కూడా తెలియజేస్తుంది. మనిషికి ఎలాంటి లక్షణాలు ఉంటె సద్గతులు కలుగుతాయో వివరించింది. ఈ రోజు మనిషి ఉండాల్సిన లక్షణాల గురించి తెలుసుకుందాం..

ప్రతి మనిషికి తాము చేసే పనుల పట్ల పాపం పుణ్యం అనే భయం ఉండాలి. అది దైవ భీతి కావచ్చు, పాప భీతి కావచ్చు. ఏదైనా భయం లేకుంటే మనిషికి, మృగానికి తేడా ఉండదట. అందుకనే మనిషి జీవన విధానం గురించి తెలుపుతూ పుణ్య కర్మలు, పాపా కర్మలను తెలియజేస్తూ ఋషులు ఎంతో ముందు చూపుతో వివిధ పురాణాలను రచించి మానవజాతికి అందించారు. కర్మ సిద్దాంతాన్ని అనుసరించి ఇది చేస్తే పాపం, ఇది చేస్తే పాపం అని భయపడుతూ చేసే పనుల పట్ల శ్రద్దగా ఉంటారు. . ఎవరినీ ద్వేషించకుండ అందరితో స్నేహంగా ఉండడం.. పిల్లల పట్ల అతి మమకారము, అహంకారము అసలు పనికిరాదు .అందరి పట్ల కరుణ దయ కలిగి ఉండి.. సుఖదు:ఖాలను సమానంగా చూడాలి. ఎటువంటి సందర్భం ఎదురైనా ఓర్పు కలిగి ఉండాలి. చంచల స్వభావం కాకుండా ధృఢమైన నిశ్చయం కలిగి మనసును అదుపులో ఉంచుకోవాలి.

అధిక కోపం ఉండరాదు. ఎ విషయం పట్ల ఎక్కువ ఆనందము పొందరాడు. అదే సమయంలో ఎక్కువగా భయపడకూడదు. ఇలాంటి ఎన్నో విషయాలు గరుడ పురాణంలో ఉన్నాయి. అవును గరుడ పురాణంలో ఉన్నవి అన్నీ పాప కర్మలు, పుణ్యం కర్మలకు సంబంధించిన విషయాలే. కనుక మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలని ఆధ్యాత్మికవే త్తలు సూచిస్తున్నారు.

గరుడపురాణం మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మానవాళికి దొరికిన ఒక మహత్తరమైన గ్రంథం. దీనిని చదవి.. అందుకు అనుగుణంగా మనిషి తన జీవితాన్ని మంచి మార్గంలో పయనించేలా ప్రయత్నిచాలని పండితులు చెబుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు