AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాతకంలో సూర్య దోషమా.. సూర్యుడి అనుగ్రహం కోసం ఆదివారం ఈ పరిహారాలు చేయండి.. ఫలితాలు మీ సొంతం

వారంలో ఆదివారం ప్రత్యక్ష దైవం సూర్యనారాయణకి అంకితం చేయబడింది. ఈ రోజున కొన్ని పరిహారాలు చేయడం ద్వారా . సూర్యభగవానుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. దీంతో జాతకంలో సూర్యుని స్థానం బల పడి జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. జీవితంలో పురోగతిని తెస్తుంది. ముఖ్యంగా మీరు చేపట్టిన పనులలో అడ్డంకులను ఎదుర్కొంటున్నట్లయితే.. ఆదివారం రోజున కొన్ని పరిహారాలను చేయండి.. సూర్య అనుగ్రహం మీ సొంతం అవుతుంది.

జాతకంలో సూర్య దోషమా.. సూర్యుడి అనుగ్రహం కోసం ఆదివారం ఈ పరిహారాలు చేయండి.. ఫలితాలు మీ సొంతం
Sunday Puja Tips
Surya Kala
|

Updated on: Apr 27, 2025 | 5:53 AM

Share

జ్యోతిష్య శాస్త్రంలో సూర్యభగవానుడిని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. అందుకే సూర్యభగవానుడి ఆశీర్వాదం పొందిన వారి జీవితంలో నిరంతర పురోగతిని సాధిస్తారని నమ్మకం. ముఖ్యంగా ఎవరి జాతకంలోనైనా సూర్యుడు బలమైన స్థితిలో ఉంటే.. వారు వృత్తి, ఉద్యోగ , వ్యాపారంలో విజయాన్ని పొందుతారు. సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి మొదటి మార్గం మీరు త్వరగా నిద్ర లేవడం. అంటే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవడం. సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా మీరు నిద్రపోతూ ఉంటే.. మీరు శక్తిని కోల్పోతారు. సోమరితనంతో ఉంటారు. అందుకే తెల్లవారు జామునే మేల్కొనడానికి ప్రయత్నించాలి. ఆదివారం సూర్యభగవానునికి అంకితం అయిన రోజుగా భావిస్తారు. ఈ రోజున చేసే కొన్ని పరిహారాలతో సూర్య దేవుడు అనుగ్రహం లభిస్తుంది. ఈ నేపధ్యంలో సూర్యభగవానుడి ఆశీస్సులు పొందడానికి ఆదివారం ఏ పరిహారాలు చేయాలో తెలుసుకుందాం..

సూర్యభగవానుడికి అర్ఘ్యం: ప్రతి రోజూ ఉదయాన్నే నిద్రలేచి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. అయితే ఏదైనా కారణం చేత మీరు రోజూ అర్ఘ్యాన్ని సమర్పించలేకపోతే.. ప్రతి ఆదివారం సూర్య దేవునికి అర్ఘ్యం సమర్పించాలి. మీరు చేపట్టిన పనిలో అడ్డంకులను ఎదుర్కొంటుంటే.. ఇలా అర్ఘ్యం ఇవ్వడం వలన ఆగిన పనులు పూర్తి కావడం ప్రారంభమవుతాయి. మంచి రోజులు ప్రారంభమవుతాయి.

ఆదివారాల్లో దానధర్మాలు: జీవితంలో దాన ధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఆదివారాల్లో దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సూర్య భగవానుడి నుంచి ప్రత్యేక ఆశీర్వాదం పొందాలనుకుంటే.. ఆదివారం రోజున చేసే దానాలకు విశిష్ట స్థానం ఉంది. కనుక ఈ రోజున అవసరమైన వారికి ధాన్యాలు, బట్టలు, స్వీట్లు, పండ్లు మొదలైనవి దానం చేయడం శుభప్రదం అని నమ్మకం.

ఇవి కూడా చదవండి

సూర్య భగవానుడికి పప్పు నైవేద్యం పెట్టి దానం చేయండి: ఎవరి జాతకంలోనైనా గ్రహ దోషం ఉండి చేపట్టిన పని చెడిపోతూ ఉంటే.. సూర్య భగవానుడికి కంది పప్పు, పెసర పప్పు వంటి ధాన్యాలు సమర్పించండి. అనంతరం వాటిని అవసరం ఉన్నవారికి దానం ఇవ్వండి. ఇలా చేయడం వలన ఆర్థిక స్థితి బలపడుతుందని నమ్మకం.

ఎర్ర చందనం తిలకం: ఏదైనా కారణం చేత మీకు ఆత్మవిశ్వాసంలోపించి.. లేదా చిన్న చిన్న విషయాలకే భయపడుతుంటే ఆదివారం రోజున ఎర్ర చందన తిలకం దిద్దుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లండి. ఆదివారం రోజున ఇలా ఎర్ర చందన తిలకంగా పెట్టుకోవడం వలన ధైర్యం, శౌర్యం పెరుగుతుంది.

రాగి పాత్రలోని నీటితో అర్ఘ్యం: ఆదివారం రోజున సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు రాగి పాత్రను ఉపయోగించండి. రాగి పాత్రని ఉపయోగించడం శుభప్రదంగా భావిస్తారు. ఇది జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తుంది.సమాజంలో కీర్తి, ప్రతిష్టలు లభిస్తాయి. సూర్య అనుగ్రహంతో జ్ఞానం, బలం, ఆరోగ్యం లభిస్తుందని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..