- Telugu News Photo Gallery Spiritual photos Jewellery Benefits for Women : know Health Benefits and Astrological Significance
Jewellery Benefits for Women: మహిళలు ధరించే ఆభరణాలు అందం కోసమే కాదు..ఆరోగ్య ప్రయోజనాల కోసమని తెలుసా..
భారతీయ మహిళలకు బంగారు నగలు అంటే అమితమైన ఇష్టం. స్త్రీలకు ఆభరణాలు అందాన్ని, ఆకర్షణను పెంచుతాయి. అయితే ఇలా మహిళలు ధరించే ఆభరణాలు అందాన్ని మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయని తెలుసా.. అవును మహిళలలు ధరించే ఆభరణాల్లో అనేక ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. నగలను ధరించడం వలన కలిగే శాస్త్రీయ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
Updated on: Apr 25, 2025 | 1:01 PM

ఆభరణాలంటే మహిళలకు ఎంత ప్రేమో అందరికీ తెలిసిందే. మహిళల అలంకరణలో ప్రధాన ప్రాతను పోషిస్తాయి ఆభరణాలు. అందుకనే ఆభరణాలు లేని స్త్రీ అలంకరణ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అయితే ఈ ఆభరణాలు మహిళల అందం.. అలంకరణకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనవి. ఈ విషయాన్ని మన ప్రాచీన ఋషులు కూడా చెప్పారు. అయితే వీటిని మహిళలకు ఆభరణాలుగా కాకుండా ఆయుధాలుగా, పని ముట్లుగా తయారు చేశారు.. కాలక్రమంలో వీటిని మహిళలు ఆభరణాల రూపంలో అలంకరించడం మొదలు పెట్టారు.

మహిళలు ఆభరణాలు ధరించడం వల్ల జ్యోతిషపరంగానే కాదు శాస్త్రీయంగా ప్రయోజనాలు ఉన్నాయి. ఆభరణాలు ధరించడం ద్వారా మహిళల ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. స్త్రీలు స్వభావరీత్యా భావోద్వేగానికి లోనవుతారు. పురుషులతో పోలిస్తే వీరి శరీరంలో అనేక దశలు వారి జీవితంలో హార్మోన్ల స్రావం ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆభరణాలన ధరించడం ద్వారా ఆ హార్మోన్లను సమతుల్యం చేయడానికి ఒక సాంకేతికతను అభివృద్ధి చేశారు.

ప్రతి లోహం దాని సొంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. బంగారాన్ని వేడి లోహంగా, వెండిని చల్లని లోహంగా పరిగణిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని శరీరంలోని ఏ భాగంలో ఏ లోహపు ఆభరణాలను ధరించాలో ప్రాచీన ఋషులు చెప్పి.. సమతుల్యం చేస్తూ మహిళలకు ఆభరణాల రూపంలో ఆరోగ్యాన్ని వరంగా ఇచ్చారు. బంగారు ఆభరణాలు శరీరంలో వేడి ప్రభావాన్ని, వెండి ఆభరణాలు చల్లని ప్రభావాన్ని సృష్టిస్తాయి. అందుకే నడుము పై భాగంలో బంగారు ఆభరణాలను ..నడుము క్రింద వెండి ఆభరణాలను ధరించాలని సూచించారు.

గాజుల ప్రయోజనాలు: గాజులు శరీరాన్ని తాకినప్పుడు.. అవి ఘర్షణ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. చేతుల్లో రక్త ప్రసరణను పెంచుతాయి. శరీరాన్ని యాక్టివేట్ చేస్తాయి. బంగారం లేదా వెండి కంకణాలు ధరించడం వల్ల శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. వెండి కంకణాలు మీ శరీరానికి చల్లదనాన్ని తెచ్చి చంద్రుడిని కూడా బలోపేతం చేస్తాయి. బంగారు గాజులు సూర్యుడిని బలోపేతం చేస్తాయి. గాజులు మానసిక సమతుల్యతను కాపాడడంలో సహాయపడతాయి.

కాలి పట్టీలు: కాలికి ధరించే పట్టీలను ఎప్పుడూ వెండితో చేసినవి ధరిస్తారు. పాదాల చీల మండల వద్ద ధరించే ఈ పట్టీల వలన చీలమండలు శరీరంలోని శక్తిని ఆదా చేస్తాయి. స్త్రీలలో కొవ్వు పెరగకుండా నిరోధిస్తాయి. శరీరంలో వేడి పెరగడానికి అనుమతించవు. చీలమండ ప్రతికూలతను తొలగిస్తుంది. ఎముకలను బలపరుస్తుంది.

కాలి మెట్టెలతో ప్రయోజనాలు: వివాహిత స్త్రీలు వైవాహిక ఆనందానికి చిహ్నంగా తమ కాలి బొటన వేలుకి పక్కన ఉన్న వెలికి మెట్టెలు ధరిస్తారు. ఇలా కాలికి మెట్టెలు ధరించడం వల్ల స్త్రీల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. కాలి మెట్టెలను ధరించడం వల్ల స్త్రీల గర్భాశయం ఆరోగ్యంగా ఉంటుంది. గర్భం దాల్చే సామర్థ్యం పెరుగుతుంది. థైరాయిడ్ సమతుల్యంగా ఉంటుంది.

వేళ్ళకు ఉంగరాలు: మహిళలు ఉంగరాలు ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి., వివిధ లోహాలు, రత్నాలతో చేసిన ఉంగరాలు వేర్వేరు ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ఉంగరం నరాలను నియంత్రిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడటమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. గ్రహాల స్థానాన్ని మెరుగుపరుస్తుంది.

చెవిపోగుల ప్రయోజనాలు: భారతీయ సంస్కృతిలో చెవులు కుట్టించుకోవడాన్ని ఒక ఆచారంగా భావిస్తారు. ఇది బుద్ధిని , ఆలోచనలను శుద్ధి చేస్తుందని అంటారు. చెవి సంబంధిత వ్యాధులు రావు.

మంగళ సూత్రం ప్రయోజనాలు: వైవాహిక ఆనందానికి చిహ్నంగా మహిళలు మంగళసూత్రాన్ని ధరిస్తారు. దీన్ని ధరించడం వల్ల మహిళలకు సానుకూల శక్తి వస్తుందని, శరీరంలో రక్త ప్రసరణను నియంత్రిస్తుందని చెబుతారు.

వడ్డాణం ప్రయోజనాలు: నముడుకి వడ్డాణం ధరించడం మూలాధార చక్రంపై ప్రభావం చూపుతుంది. నడుము క్రింద ఉన్న అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనివల్ల మూత్రపిండాలు . మూత్రాశయ వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.




