- Telugu News Photo Gallery Spiritual photos Rare Amavasya 2025: Special Yogas for 6 Lucky Zodiac Signs Details in Telugu
Rare Amavasya: అరుదైన అమావాస్య.. ఆ రాశుల వారికి విశిష్ట యోగాలు పట్టబోతున్నాయ్..!
Amavasya Rashifal: జ్యోతిషశాస్త్రం ప్రకారం రవి, చంద్రుల కలయిక వల్ల అమావాస్య ఏర్పడుతుంది. జాతక చక్రంలో రవి, చంద్రుల కలయిక సహజమే కానీ, ఉచ్ఛ రవితో చంద్రుడు కలవడం మాత్రం ఏడాదికి ఒక సారి జరుగుతుంది. ఈ నెల(ఏప్రిల్) 27న మేష రాశిలో ఉచ్ఛ రవితో చంద్రుడు కలవడం వల్ల అమావాస్య ఏర్పడుతోంది. ఇవి రెండు రాజయోగ కారక గ్రహాలైనందు వల్ల కొన్ని రాశుల వారికి మే 12న సంభవించే పౌర్ణమి లోగా ముఖ్యమైన శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. మేషం, మిథునం, కర్కాటకం, సింహం, ధనుస్సు, కుంభ రాశుల వారికి యోగదాయకంగా ఉండే అవకాశం ఉంది.
Updated on: Apr 26, 2025 | 11:34 AM

మేషం: ఈ రాశిలో రెండు రాజయోగ గ్రహాలు కలవడం వల్ల ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక లాభాలు కలిగే అవకాశం కూడా ఉంది. వృత్తి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. సమాజంలో పలుకుబడి బాగా పెరుగుతుంది. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది.

మిథునం: ఈ రాశికి లాభస్థానంలో రవి చంద్రుల యుతి ఏర్పడుతున్నందువల్ల అనేక విధాలుగా ధన లాభాలు కలుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీతో పాటు రాబడి కూడా బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది.

కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానంలో రెండు రాజయోగ గ్రహాలు కలుస్తున్నందువల్ల ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ప్రభుత్వంలో లేదా రాజకీయాల్లో ఉన్నవారికి అధికార యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొద్ది మార్పులతో లాభాల బాట పట్టే సూచనలున్నాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోవడం జరుగుతుంది.

సింహం: ఈ రాశికి అధిపతి అయిన రవి ఉచ్ఛలో ఉండి చంద్రుడితో యుతి చెందడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. రెండు మూడు పర్యాయాలు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తులు వివాదాల నుంచి బయటపడతాయి.

ధనుస్సు: ఈ రాశికి పంచమ స్థానంలో రవి, చంద్రులు కలవడం వల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. ఇంటాబయటా మీ శక్తి సామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి.

కుంభం: ఈ రాశికి తృతీయ స్థానంలో ‘అమావాస్య’ ఏర్పడడం వల్ల అంచనాలకు మించిన ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదాలు పెరుగుతాయి. జీతభత్యాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలను రాజీమార్గంలో పరిష్కరించుకుంటారు. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది.



