కొండను జల్లెడ పడుతున్న భద్రతా దళాలు.. అణువణువు తనిఖీలు, ముమ్మర సోదాలు..!
పహల్గామ్ దాడితో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఉగ్ర క్యాంపులను అంతమొందించేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంటే, మరోవైపు ఆధ్యాత్మిక కేంద్రాల్లో నిఘా కట్టుదిట్టమైంది. ఇందులో భాగంగానే పహల్గామ్ ఉగ్ర దాడి ఆలయాల జిల్లాను అప్రమత్తం చేసింది. అణువణువు జల్లడపడుతున్నాయి భద్రతా దళాలు.. తిరుపతి, తిరుమలతో పాటు శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలను హై అలెర్ట్ చేసింది.

పహల్గామ్ దాడితో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఉగ్ర క్యాంపులను అంతమొందించేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంటే, మరోవైపు ఆధ్యాత్మిక కేంద్రాల్లో నిఘా కట్టుదిట్టమైంది. ఇందులో భాగంగానే పహల్గామ్ ఉగ్ర దాడి ఆలయాల జిల్లాను అప్రమత్తం చేసింది. అణువణువు జల్లడపడుతున్నాయి భద్రతా దళాలు..
తిరుపతి, తిరుమలతో పాటు శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలను హై అలెర్ట్ చేసింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలపై భద్రతా దళాలు దృష్టి పెట్టాయి. తిరుపతి, తిరుమలలో తనిఖీలు ముమ్మరం చేసింది. టీటీడీ విజిలెన్స్, పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై సోదాలు నిర్వహిస్తోంది. తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ తోపాటు యాత్రికులు బస చేసే శ్రీనివాసం, విష్ణు నివాసం, ఇతర సత్రాల వద్ద భద్రత పెంచింది. తిరుపతిలోని ప్రధాన కూడళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తోంది సెక్యూరిటీ సిబ్బంది.
ఇక తిరుమలలో అణువణువు సోదాలు చేపట్టిన పోలీసు యంత్రాంగం అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలు, జీఎన్సీ టోల్గేట్, పాపవినాశం వెళ్ళే దారి లో విస్తృత తనిఖీలు చేపట్టింది. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పోలీసులు అనుమానిత వ్యక్తుల ఆధార్ కార్డులను పరిశీలిస్తున్నారు. ఉగ్ర దాడి నేపధ్యంలో నిరంతరాయంగా తనిఖీలు కొనసాగుతుండగా శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాల్లోనూ ఆక్టోపస్ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి.
మరోవైపు, తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. వేసవి సెలువుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అలిపిరి దగ్గర బారులు దీరాయి భక్తుల వాహనాలు.. సప్తగిరి తనిఖీ కేంద్రం వరకు రద్దీ కనిపిస్తోంది. తిరుమలకు వెళ్లేందుకు భక్తులు సొంత వాహనాల్లో తరలిరావడంతో తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వాహనాలతో కిక్కిరిసిపోయింది. రద్దీ దృష్ట్యా తిరుమల వచ్చే భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి భద్రతా దళాలు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
