AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: చాణక్య ఉత్తమ స్త్రీ లక్షణాలు ఇవే.. వీరు కుటుంబానికే కాదు దేశానికి దిశానిర్దేశం చేస్తారట..

ప్రకృతి పరుషుడు కలిస్తేనే సృష్టి.. అయితే నేటి కాలంలో స్త్రీని మైనస్ గా భావిస్తున్నారు.. కానీ పురాతన కాలంలో స్త్రీకి అత్యంత విశిష్ట స్థానం ఇచ్చారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడటారో అక్కడ దేవుళ్ళు కొలువై ఉంటారని చెప్పిన ధర్మం మనది. అటువంటి స్త్రీ గురించి ఆచార్య చాణక్య అనేక విషయాలను తన నీతి శాస్త్రంలో వెల్లడించాడు. స్త్రీ శారీరకంగా బలహీనమైనా మానసికంగా అత్యంత బలవంతురాలని పేర్కొన్నాడు. తన ఫ్యామిలీకి ఎటువంటి కష్టం వచ్చినా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడే తత్వం స్త్రీ సొంతం అని పేర్కొన్నాడు. ఈ రోజు ఉత్తమ స్త్రీ లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం..

Chanakya Niti: చాణక్య ఉత్తమ స్త్రీ లక్షణాలు ఇవే.. వీరు కుటుంబానికే కాదు దేశానికి దిశానిర్దేశం చేస్తారట..
Chanakya Niti
Surya Kala
|

Updated on: Apr 27, 2025 | 7:48 AM

Share

ఇంటిని చూసి ఇల్లాలి గురించి చెప్పవచ్చు అంటారు పెద్దలు.. అదే విధంగా సమాజంలో స్త్రీల పాత్ర చాలా ముఖ్యమైంది. మన పురాణ గ్రంథాలలో కూడా స్త్రీల పాత్ర, స్త్రీల గుణగణాలను గొప్పగా చెప్పారు. అదే విధంగా పండితుడు, దౌత్యవేత్త, ఆర్థికవేత్త, రాజకీయ వేత్త అయిన ఆచార్య చాణక్యుడు కొన్ని వందల ఏళ్ల క్రితం స్త్రీల స్వభావం గురించి అనేక విషయాలను తన నీతి శాస్త్రంలో చెప్పాడు. అతి సున్నితంగా కనిపించే స్త్రీలు దైర్యానికి ప్రతి రూపం అని.. వీరిలో అపారమైన శక్తి ఉందని పేర్కొన్నాడు.

తన కుటుంబంలో అనుకోని సంక్షోభం ఎదురైతే తన భర్త, పిల్లలు, కుటుంబం, వంశాన్ని రక్షించే గుణం స్త్రీల సొంతం అని చెప్పాడు. ఇటువంటి మహిళలు రాజ్యానికి, సమాజానికి కొత్త దిశానిర్దేశం చేస్తారు. దేశాభివృద్ధికి ప్రత్యేక సహకారాన్ని అందిస్తారని ఆచార్య చాణక్య తెలిపాడు.

అంతేకాదు స్త్రీల లక్షణాలు గురించి ఇంకా చెబుతూ . చైవ కామశ్చాష్టగుణం: స్మృత: అంటే పురుషుల కంటే స్త్రీలకు రెండు రెట్లు ఎక్కువ ఆకలి ఉంటుందని.. స్త్రీలు పురుషులకంటే ఎక్కువ ఆహారం తింటారని చెప్పాడు. అదే విధంగా వినయం కూడా ఎక్కువగా ఉంటుందని అన్నాడు.

ఇక పురుషుల కంటే స్త్రీలు స్వతహాగా సిగ్గరులని వీరిలో సిగ్గు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందట. ధైర్యం ఆరు రెట్లు ఎక్కువ..కామం ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పాడు చాణక్యుడు.

ఇంకా స్త్రీ లక్షణాల గురించి చెబుతూ మహిళలు మధురమైన మాటలు మాట్లాడాలని చెప్పాడు. స్త్రీలు వాడే బాషతోనే సమాజంలో వాతావరణం ఉంటుందని చెప్పాడు. స్త్రీ ఎప్పుడూ తప్పుడు భాషని ఉపయోగించ రాదని.. ఇలా తప్పుడు మాటలు మాట్లాడితే మహిళల ఆలోచనలో స్వచ్ఛత లోపిస్తుందని చాణక్యుడు అన్నాడు.

మాట అదుపులేని స్త్రీలు అధిక ఒత్తిడికి గురయ్యి.. మనసుపై మెదడుపై ప్రభావం చూపించి తీవ్ర వ్యాధులతో బాధపడతారని పేర్కొన్నాడు.

కనుక స్త్రీలు మాటని అదుపు చేసుకునే నేర్పు కలిగి ఉండాలని.. మంచి మాటలే మాట్లాడాలని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడక్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us
ఇంట్లో మనశ్శాంతి లేదా?.. రాక్ సాల్ట్‌తో ఇలా చేయండి
ఇంట్లో మనశ్శాంతి లేదా?.. రాక్ సాల్ట్‌తో ఇలా చేయండి
పెనం పైనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్..
పెనం పైనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్..
మరోసారి పెరగనున్న గ్యాస్ సిలిండర్ల ధరలు
మరోసారి పెరగనున్న గ్యాస్ సిలిండర్ల ధరలు
మొదటిసారి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా?.. ఇవి తప్పక తెలుసుకోండి
మొదటిసారి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా?.. ఇవి తప్పక తెలుసుకోండి
పక్కా కొలతలతో రవ్వ లడ్డు.. తిన్న వాళ్ళు మెచ్చుకోవాల్సిందే
పక్కా కొలతలతో రవ్వ లడ్డు.. తిన్న వాళ్ళు మెచ్చుకోవాల్సిందే
పుష్యరాగం ధరించాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తప్పనిసరిగా..
పుష్యరాగం ధరించాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తప్పనిసరిగా..
బిలియన్ డాలర్ల సారీ..! ఇండియాతో ఎందుకీ తొండాట?
బిలియన్ డాలర్ల సారీ..! ఇండియాతో ఎందుకీ తొండాట?
రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా.. సీక్రెట్ టిప్‌తో ఇలా చేయండి
రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా.. సీక్రెట్ టిప్‌తో ఇలా చేయండి
అర్ధరాత్రి శ్మశానానికి తీసుకెళ్లి ప్రపోజల్: జబర్దస్త్ నటుడి భార్య
అర్ధరాత్రి శ్మశానానికి తీసుకెళ్లి ప్రపోజల్: జబర్దస్త్ నటుడి భార్య
వేగంగా బరువు తగ్గుతున్నారా? ఆకలి తగ్గిపోతోందా? అస్సలు నిర్లక్ష్యం
వేగంగా బరువు తగ్గుతున్నారా? ఆకలి తగ్గిపోతోందా? అస్సలు నిర్లక్ష్యం