AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలకు ప్రేమ చూపించడానికి ఇదే సులభమైన మార్గం..! వారి భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా..?

తల్లులు తమ పిల్లలను కౌగిలించుకోవడం వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్యమైన భాగం. ఈ తల్లిదండ్రుల ప్రేమ పిల్లలలో నమ్మకం, కరుణ, బాధ్యతను పెంచుతుంది. ఇది పిల్లల భవిష్యత్తుపై మంచి ప్రభావం చూపుతుంది. అధ్యయనాలు చెబుతున్నట్లుగా తల్లి ప్రేమ పిల్లల వ్యక్తిత్వాన్ని శాశ్వతంగా ప్రభావితం చేస్తుంది.

పిల్లలకు ప్రేమ చూపించడానికి ఇదే సులభమైన మార్గం..! వారి భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా..?
Parental Affection
Prashanthi V
|

Updated on: Apr 27, 2025 | 9:37 PM

Share

తల్లులు తమ పిల్లలను కౌగిలించుకోవడం వల్ల వారు నమ్మకంగా, కరుణతో, బాధ్యతగా మారతారని అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లలకు తగిన ప్రేమను చూపించడానికి సులభమైన మార్గం వారిని కౌగిలించుకోవడం.. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ వెల్లడించిన తాజా అధ్యయనం ప్రకారం తల్లి మమకారం పిల్లల జీవితాన్ని గట్టిగా ప్రభావితం చేస్తుంది. వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.

పిల్లలు ఐదు నుంచి పది సంవత్సరాల మధ్య వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటారు. ఈ వయస్సులో తల్లి నుంచి లభించే కౌగిలింతలు పిల్లల్లో నమ్మకం పెంచుతాయి. అంతేకాదు కరుణతో, బాధ్యతతో కూడిన స్వభావాన్ని పెంపొందిస్తాయి. చిన్న వయస్సులో లభించే ప్రేమ సహాయంతో వారు భవిష్యత్తులో ఉన్నతమైన వ్యక్తులుగా మారుతారు.

బాల్యంలో పిల్లలు ఎదుర్కొనే ఒత్తిడి, సవాళ్లు వారిపై మానసిక ప్రభావం చూపుతాయి. ఈ ఒత్తిడిని తల్లి ప్రేమతో అధిగమించవచ్చు. తల్లి నుంచి లభించే మమకారం, పిల్లల్లో నమ్మకాన్ని పెంపొందిస్తుంది. దీని వల్ల వారు మానసిక సమస్యల నుంచి దూరంగా ఉండగలుగుతారు.

కవలలపై నిర్వహించిన అధ్యయనం వివరాలు.. ఈ అధ్యయనంలో UKలోని 2,200 మంది కవలలు పాల్గొన్నారు. వీరు ఒకే DNA కలిగి ఉన్నా వేర్వేరు వాతావరణాల్లో పెరిగారు. తల్లి చూపే సంరక్షణ, ఆప్యాయత పరిమాణం వేర్వేరుగా ఉండటం గమనించారు. ఇద్దరు పిల్లలకు ఒకరికి ఎక్కువ ప్రేమ దొరకడం, మరొకరికి తక్కువ దొరకడం వల్ల వారి వ్యక్తిత్వాల్లో తేడాలు కనిపించాయి.

తల్లి ప్రేమను ఎక్కువగా పొందిన పిల్లలు పెద్దయ్యాక కరుణతో కూడిన వ్యక్తిత్వం కలిగి ఉన్నారు. వారు శ్రద్ధతో వ్యవహరించే నైపుణ్యాన్ని మెరుగుపర్చుకున్నారు. వ్యవస్థీకృతంగా, నమ్మదగినవారిగా ఎదిగారు. ఈ మార్పులకు ప్రధాన కారణం తల్లి చూపిన ప్రేమ, కౌగిలింతలు అని అధ్యయనం చెబుతోంది.

పిల్లల వ్యక్తిత్వం తీర్చిదిద్దడంలో కౌగిలింతలు ప్రధాన పాత్ర పోషిస్తాయని అధ్యయనం నిరూపించింది. వంశపారంపర్య ప్రభావాన్ని మించిన స్థాయిలో తల్లి చూపే పెంపకంపైనే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని వివరించారు. తల్లిదండ్రులు చూపే ప్రేమ పిల్లల జీవితాన్ని శాశ్వతంగా ప్రభావితం చేస్తుంది.

తల్లిదండ్రులు పిల్లలను ఎంత తరచూ కౌగిలించుకుంటారో అది పిల్లల భవిష్యత్తు వ్యక్తిత్వాన్ని నిర్ణయించడంలో కీలకంగా మారుతుంది. పిల్లలను హత్తుకునే విషయంలో కొంచెం అటుఇటుగా ఉన్నా.. అది వాళ్లు పెద్దయ్యాక ఎలా ప్రవర్తిస్తారనే దానిపై ప్రభావం చూపిస్తుందని ఒక స్టడీలో తేలింది.