Viral Video: అరెరే.. అరటి పండును ఇలా తినాలా..? ఇన్ని రోజులు మనం తప్పుగా తిన్నామట..!
అరటి పండు అందరికీ ప్రియమైనది. అంతేకాదు.. అందరికీ అందుబాటులో లభిస్తుంది. కానీ, మనం అరటిపండ్లు తప్పుగా తింటున్నాం. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక విదేశీయుడు అరటి పండు తినేందుకు సరైన పద్ధతి ఏంటో నేర్పించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఇంటర్‌నెట్ నిండా నవ్వులు పూయిస్తోంది. అదేంటో మనమూ చూసేద్దాం పదండి..

మన అందరం అరటి పండ్లు తింటూ ఉంటా.. అయితే, దాదాపుగా అందరూ అరటి పండును సాధారణంగానే తొక్కతీసి తింటారు. కానీ, వైరల్ వీడియోలో ఒక బ్రిటిష్ వ్యక్తి అరటిపండు తింటున్న స్టైల్ అందరినీ అవాక్కయ్యేలా చేసింది. మనం తొక్క తీసి క్షణాల్లో తినే అరటిపండును అతడు ఎలా తింటున్నాడో చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ తింటారు. ఇది చూసిన నెటిజన్లు నివ్వరపోతున్నారు. సోషల్ మీడియా నవ్వులతో నిండిపోయింది. ఈ వైరల్ వీడియోను ప్రజలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
బ్రిటిష్ వ్యక్తి అరటి పండు తింటున్న ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వేగంగా చక్కర్లు కొడుతోంది. దీనిలో బ్రిటన్‌కు చెందిన ఫేమస్ పర్సన్ విలియం హాన్సన్ అరటిపండు తినడానికి సరైన మార్గం ఏంటో వివరిస్తున్నాడు. కానీ, అతని స్టైల్ చాలా ప్రత్యేకంగా ఉంది. @williamhansonఅనే ఇన్‌స్టా వేదికగా ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీనిలో అరటిపండ్లను మీ చేతులతో కాదు, కత్తి, ఫోర్క్‌తో తినాలని వివరించాడు.
వీడియోలో విలియం డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఉన్నాడు. అతని ముందు ఒక ప్లేట్, కత్తి, ఫోర్క్, పండిన అరటిపండు ఉన్నాయి. అతను మొదట అరటిపండు రెండు చివరలను కట్ చేశాడు. తరువాత కత్తితో తొక్కను లైట్‌గా కోసి, ఆపై ఫోర్క్ తో అరటిపండును మెల్లగా తింటున్నాడు. పైగా అతను అరటిపండ్లను కోతులలాగా మీ చేతులతో తినకూడదని కూడా అంటున్నాడు.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
అరటిపండు తింటున్న ఈ వైరల్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వేగంగా వైరల్ అయింది. లక్షలాది వీక్షణలను సంపాదించింది. కామెంట్ సెక్షన్‌లో ప్రజలు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ.. మీరు ఒక అరటి పండు తినే సమయంలో నేను దాదాపు అరడజను తినగలిగేవాడిని అంటూ ఒకరు రాశారు. మరొకరు ఇది అరటిపండుకు ఆపరేషన్ చేస్తున్నట్టుగా ఉందని చెప్పారు. అరటి పండును ఇలా తినటం ఎవరికీ నచ్చకపోవచ్చు, కానీ ఈ వీడియో మాత్రం ప్రజలను మనసారా నవ్వుకునేలా చేసింది సందేహం లేదు. చేతులతో తిన్నా లేదా ఫోర్క్ తో తిన్నా, అరటిపండు ఇప్పటికీ అరటిపండే.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




