AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎడారిలో బయటపడ్డ 500 ఏళ్లనాటి పురాతన ఓడ.. లోపల ఖజానానే ఖజానా!

సముద్రం నుండి మైళ్ళ దూరంలో ఇసుకతో నిండిన ఎడారిలో భారీ నిధి దొరికింది. అది నిజంగానే అందరినీ ఆశ్చర్యపరిచే అద్భుతమైన నిధి. 16వ శతాబ్దపు పోర్చుగీస్ కాలంనాటి ఓడ ఒకటి ఎడారిలో గుర్తించబడింది. గత 500 సంవత్సరాలుగా ఎవరూ ఊహించని, కలలో కూడా చూడదని నిధి రహస్యాన్ని తనలో దాచుకుని ఎవరైనా వస్తారని ఎదురుచూస్తోంది. ఎట్టకేలకు పురావస్తు శాస్త్రవేత్తలు దానిని కనిపెట్టారు. ఇంతకీ ఆ ఓడలో ఉన్న నిధి సంగతి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్‌ అవుతారు.. ఎందుకంటే. అది లెక్కకు అందనిదిగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఎడారిలో బయటపడ్డ 500 ఏళ్లనాటి పురాతన ఓడ.. లోపల ఖజానానే ఖజానా!
500 Year Old Ship
Jyothi Gadda
|

Updated on: Dec 31, 2025 | 4:21 PM

Share

ఇసుక దిబ్బల కింద కూరుకుపోయిన ఒక పురాతన ఓడను గుర్తించారు శాస్త్రవేత్తలు. అదేదో సాధారణమైన ప్రయాణికులతో వెళ్తున్న ఓడ కాదు.. దాని నిండా బంగారం దాగి ఉంది. ఒకప్పుడు అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణించినట్టుగా గుర్తించారు. 16వ శతాబ్దపు పోర్చుగీస్ ఓడను గుర్తించిన శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. ప్రస్తుతం ఓడ దొరికిన ప్రాంతం సముద్రానికి చాలా దూరంగా ఉంది. కానీ, ఒకప్పుడు బలంమైన అలలు ఢీకొనే ప్రదేశంగా పరిశోధకులు చెబుతున్నారు.

ఆఫ్రికాలోని నమీబ్ ఎడారిలో పురావస్తు శాస్త్రవేత్తలు చరిత్రకారులను సైతం ఆశ్చర్యపరిచే ఒక ఆవిష్కరణ చేశారు. నమీబ్ ఎడారి మధ్యలో బంగారంతో నిండిన ఒక ఓడను గుర్తించారు. సుమారు ఇది 500 సంవత్సరాల పురాతనమైన పోర్చుగీస్‌ కాలం నాటి ఓడగా పరిశోధకులు చెబుతున్నారు. సముద్రంలో ప్రయాణించే ఓడ ఎడారి మధ్యలో ఎలా నిలిచిందో అనే అంశంపై ఇప్పుడు సర్వత్రా చర్చ మొదలైంది.

ఇవి కూడా చదవండి

futurasciences.com ప్రకారం, ఈ ఓడ 2008లో నమీబియాలో వజ్రాల తవ్వకం సమయంలో కనుగొనబడింది. తవ్వకం సమయంలో ఆ ప్రదేశం నుండి నీటిని తొలగించారు. పురావస్తు శాస్త్రవేత్తలు 200 మీటర్ల విస్తీర్ణంలో తవ్వి, ఒక చెక్క నిర్మాణాన్ని గుర్తించారు. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ఓడకు ఆరంజెముండ్ షిప్‌రెక్ అని పేరు పెట్టారు. తరువాత జరిపిన పరిశోధనలో ఆ ఓడ 1500లలో మునిగిపోయిన బోమ్ జీసస్ అని తేలింది. ఈ ఓడ లోపల దాదాపు 2,000 బంగారు నాణేలు, వెండి నాణేలు, వందల కిలోల రాగి కడ్డీలు, ఖరీదైన దంతాలు లభించాయి. వందల ఏళ్లు గడిచినప్పటికీ ఈ వస్తువులన్నీ అద్భుతమైన స్థితిలోనే లభించాయి. ఈ వస్తువులు ఆ యుగం నాటి వాణిజ్యం గురించి తెలియజేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. వందల సంవత్సరాల తరువాత కూడా ఈ వస్తువులు చెక్కుచెదరని స్థితిలో ఉండటం నిజంగా ఆశ్చర్యకరమైన అంశంగా చెబుతున్నారు.

ఇకపోతే, సముద్రం నుండి ఓడ ఎడారికి ఎలా చేరుకుంది అనే విషయం అందరినీ షాక్‌ అయ్యేలా చేసింది. అయితే, ఈ బోమ్ జీసస్ అనే ఓడ వ్యాపారం కోసం భారతదేశానికి వెళుతోందని చరిత్రకారులు చెబుతున్నారు. 1533 మార్చిలో నమీబియా తీరాన్ని తీవ్ర తుఫాను తాకింది. దీని ఫలితంగా ఓడ రాళ్లను ఢీకొట్టి మునిగిపోయింది. ఆ సమయంలో ఓడలో 200 మంది ఉన్నారని చెబుతున్నారను. కానీ, 500 సంవత్సరాల ఈ పురాతన ఓడ సమీపంలో ఎటువంటి మానవ అవశేషాలు లభించలేదని చెప్పారు. ఓడ మునిగిపోయిన తర్వాత ఆ 200 మంది ఎక్కడ అదృశ్యమయ్యారనేది తెలియలేదు. ఇది పురావస్తు శాస్త్రవేత్తలకు వీడని మిస్టరీగా చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..