Goat Blood: మేక రక్తం తింటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
మేక రక్తం పోషకాలతో నిండిన ఆహారం. ఇది ప్రోటీన్, ఐరన్, విటమిన్ బి12తో సమృద్ధిగా ఉంటుంది. రక్తహీనతను నివారించి, ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. కండరాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే, మేక రక్తంలో ప్యూరిన్ అధికంగా ఉన్నందున యూరిక్ యాసిడ్, గౌట్ సమస్యలు ఉన్నవారు దీనిని మితంగా తీసుకోవాలి లేదా నివారించాలి. వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

మనలో చాలా మంది నాన్ వెజ్ ఫుడ్ అంటే ఇష్టంగా తింటారు. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు ఇలా రకరకాల మాంసాహారాలు తింటుంటారు. ఇక, ఆదివారం వచ్చిందంటే చాలు ఎక్కువ మంది ఇళ్లలోనే నాన్ వెజ్ వంటకాలే ఉంటాయి. మటన్‌లోనూ వెరైటీలు ఉన్నాయి. మేక తలకాయ, మేక కాళ్లు, బోటీ, రక్తం ఇలా మేక పార్ట్స్ కూడా సపరేటుగా వండుకుని తింటారు. చాలా మంది మేక రక్తాన్ని ఇష్టంగా వండుకుని తింటారు.అయితే, మేక రక్తంతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా..? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చుద్దాం.
మానవ రక్తంలాగే.. మేక రక్తం కూడా హిమోగ్లోబిన్‌తో సమృద్ధిగా ఉంటుంది. మేక రక్తంలో ప్రోటీన్, ఐరన్, విటమిన్ బి12, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. మేక రక్తం ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది. జింక్, సెలీనియం, ఫాస్ఫరస్ వంటి ఇతర ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మేక రక్తంలో 17 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది కండరాల పెరుగుదలకు, వివిధ శరీర కదలికలకు సాయపడుతుంది.
View this post on Instagram
యూరిక్ యాసిడ్‌తో బాధపడుతున్న వారు మేక రక్తం ఎక్కువగా తీసుకోకూడదని చెబుతున్నారు. మేక రక్తంలో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ఇది గౌట్ సమస్యలు ఉన్నవారికి సమస్యలను కలిగిస్తుంది. ఇది గౌట్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. దీంతో కీళ్ల నొప్పులు ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అందుకే గౌట్ సమస్యలతో ఉన్నవారు మేక రక్తం తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




