AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిన్న వెంటనే టీ తాగితే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా? అసలు విషయం తెలిస్తే షాకే..

భోజనం ముగించగానే వేడి వేడి టీ తాగుతున్నారా? ఆ ఉత్సాహం వెనుక మీ ఆరోగ్యానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి మీకు తెలుసా? మనం తిన్న ఆహారంలోని పోషకాలను మీ శరీరం గ్రహించకుండా ఈ టీ అడ్డుపడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు భోజనం తర్వాత టీ తాగడం వల్ల శరీరంలో జరిగే ఆ మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తిన్న వెంటనే టీ తాగితే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా? అసలు విషయం తెలిస్తే షాకే..
Side Effects Of Tea After Meals
Krishna S
|

Updated on: Mar 06, 2026 | 2:18 PM

Share

చాలా మందికి భోజనం ముగించగానే ఒక కప్పు వేడి వేడి టీ తాగడం అలవాటు. అలా తాగితే భోజనం అరుగుతుందని, ఉత్సాహంగా ఉంటుందని భావిస్తారు. కానీ, ఈ అలవాటు ఆరోగ్యానికి మేలు చేయడం కంటే కీడే ఎక్కువ చేస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీలో టానిన్లు అనే పదార్థాలు ఉంటాయి. ఇవి మనం తిన్న ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా ఆహారంలోని ఐరన్ వంటి కీలక పోషకాలను టానిన్లు బంధిస్తాయి. దీనివల్ల శరీరం ఐరన్‌ను గ్రహించలేదు, ఫలితంగా రక్తహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం

భోజనం తర్వాత టీ తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. టీలోని కెఫిన్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల చాలా మందికి గ్యాస్, అజీర్ణం సమస్యలు తలెత్తుతాయి. గుండెల్లో మంట లేదా ఎసిడిటీ ఏర్పడుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగినప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, భోజనం తర్వాత తాగినప్పుడు కూడా దాదాపు అవే సమస్యలు ఎదురవుతాయి.

ఎప్పుడు తాగడం మంచిది?

టీ ప్రియులు తమ అలవాటును పూర్తిగా మానుకోలేకపోతే, కనీసం సమయం విషయంలో జాగ్రత్త వహించాలి. భోజనం చేసిన తర్వాత కనీసం 20 నుండి 30 నిమిషాల వరకు వేచి ఉండాలి. ఈ గ్యాప్‌లో ఆహారం కొంతవరకు జీర్ణం కావడం ప్రారంభమవుతుంది కాబట్టి, ఆ తర్వాత టీ తాగితే పెద్దగా ఇబ్బంది ఉండదు.

ఆరోగ్యకరమైన చిట్కాలు

  • రోజుకు 2 లేదా 3 కప్పుల కంటే ఎక్కువ టీ తాగకూడదు. అతిగా తాగితే నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి.
  • టీలో చక్కెర పరిమాణాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం ఉత్తమం.
  • సాధారణ టీకి బదులుగా హెర్బల్ టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Follow Us