AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic People: ఇలాంటి వ్యక్తులను మీ జీవితంలోకి అస్సలు రానివ్వొద్దు!

మన జీవితం సాఫీగా సాగిపోవాలంటే మనతోపాటు ఉండేవారు మనకు కొంత మద్దతు ఇచ్చేవారై ఉండాలి. మన ఆనందాన్ని తమ ఆనందంగా జరుపుకునేవారై ఉండాలి. మనం బాధలో ఉంటే ఓదార్చేవారై ఉండాలి. ఇలా కాకుండా మన విజయం పట్ల అసూయ పడేవారిని, మనం బాధలో ఉన్నప్పుడు ఆనందించేవారిని మన జీవితంలోకి ఎప్పుడూ రానియ్యొద్దు. లేదంటే వారు మనకు లేనిపోని సమస్యలను సృష్టిస్తారు.

Toxic People: ఇలాంటి వ్యక్తులను మీ జీవితంలోకి అస్సలు రానివ్వొద్దు!
Toxic People
Rajashekher G
|

Updated on: Dec 31, 2025 | 3:38 PM

Share

మనం జీవితంలో అనేక మంది వ్యక్తులను కలుస్తుంటాం. వారిలో కొందరు మనకు దగ్గరవుతారు. అందులో కూడా మన గురించి మంచిగా ఆలోచించేవారు తక్కువగా ఉంటారు. వారిలో మనకు ఏదైనా కష్టం వస్తే సహాయపడేవారు ఇంకా తక్కువ. అందుకే మనం మన దగ్గరి వ్యక్తులుగా మనకు అనుకూలంగా ఉన్నవారిని మాత్రమే ఎంచుకోవాలి. మన శక్తిని, సమయాన్ని వృథా చేసేవారికి దూరంగా ఉండాలి. ఈ 9 చెడు లక్షణాలున్న వ్యక్తులకు దూరంగా ఉంటే మంచిదని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.

వారి అవసరమే ముఖ్యం

కొంతమంది మన నుంచి వారికి ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్ కాల్ చేస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని పూర్తిగా మర్చిపోతారు. వారికి అవసరమైనప్పుడు మాత్రమే మీరు గుర్తుకు వస్తారు. మీ అవసరాలను మాత్రం వారు గుర్తించరు. అందుకే ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి.

ఒక వైపు నుంచే స్నేహం మీరు స్నేహితులుగా, దగ్గరి వ్యక్తులుగా ఎంచుకునేవారు మీ అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలి. ఎప్పుడూ మీరే వారికి అన్ని పనుల్లో సహాయం చేయడం.. వారు మాత్రం మీకు అవసరమైనప్పుడు దూరంగా ఉండటం సరికాదు. మీరు మాత్రమే వారి స్నేహాన్ని కోరుకుంటూ సరిపోదు.. ఎదుటివారు కూడా మీతో స్నేహంగా ఉండాలని భావించాలి. అలా భావించని వ్యక్తులను వదిలేస్తేనే మంచిది.

మిమ్మల్ని తక్కువ చేయడం మీరు జీవితంలో మీ ఆశయాలను లేదా లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు.. అది జరగదు, మీరు అలా చేయలేరు, మీకు సాధ్యం కాదు అని నిరాశ పరిచేవారికి దూరంగా ఉండాలి. మీరు మీ జీవితంలో ఎదిగేందుకు వారి ఎలాంటి సాయం చేయరు. మీ కలలను తక్కువ చేసి చూస్తారు. ఇలాంటి వ్యక్తులను దూరం పెట్టాలి.

మీ విజయంలో ఉండరు మీరు ఏదైనా విజయం సాధించినప్పుడు మీ సంతోషంలో వారు పాలుపంచుకోరు. మీరు మీకు వచ్చిన మంచి అవకాశం గురించి గానీ, శుభవార్త గురించిగానీ చెబితే వారు హృదయపూర్వకంగా అభినందించరు. వాళ్లు పరోక్షంగా మీపై అసూయ చూపుతారు. మీ విజయాన్ని తక్కువ చేస్తారు. ఇలాంటి వారికి కూడా దూరంగా ఉండాలి.

మీ పనులకు ఆటంకం మీతో మంచి సంభాషణలకు బదులుగా అనవసరమైన విషయాలు గురించి ప్రస్తావిస్తూ ఫిర్యాదులు, అర్ధరహిత చర్చలతో సమయాన్ని వృథా చేసేవారి నుంచి కూడా దూరంగా ఉండాలి. ఇలాంటివారు మీ మనశ్శాంతిని దూరంగా చేస్తారు. మీరు మీకు సంబంధించిన ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టకుండా చేస్తారు.

మీపై నిందలు వేయడం వారు తప్పు చేసినప్పటికీ.. వారు తమ తప్పును అంగీకరించకుండా మీతో వాదనకు దిగుతారు. మీరే ఆ తప్పు చేశారని నిందిస్తారు. ఇలాంటి వారి నుంచి కూడా మీరు దూరంగా ఉంటే మంచిది.

మీకు మద్దతు ఉండదు మీరు ఏదైనా విషయంలో ఉత్తమంగా నిలుస్తే వారు మిమ్మల్ని అభినందించరు. పోటీదారుడిగానే పరిగణిస్తారు. మీకు ఏదైనా సమస్య వస్తే మీ ముందు సానుభూతి నటించి.. వెనుకాల ఆనందపడతారు. వారు తమ జీవితాలను మీ జీవితం పోలుస్తూ బాధపడతారు. అంతేగాక, మీకు ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తారు.

మీ గురించి తప్పుగా.. మీ గురించి ఇతరుల వద్ద ఉన్నది లేనట్లుగా చెప్పవారితో జాగ్రత్తగా ఉండాలి. వారు మీ స్నేహితులుగా ఉంటూనే ఇతరుల వద్ద మీ గురించి చెడుగా చెబుతారు. మీ వ్యక్తిగత రహస్యాలను ఇతరులకు అందిస్తారు. ఇలాంటి వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి.

మీరు కష్టాల్లో ఉంటే వారు కనబడరు మీరు సంతోషంగా జీవితం గడుపుతున్నంత సేపు వారు మీతోనే ఉంటారు. మీకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినప్పుడు, మీరు బాధలో ఉన్నప్పుడు వారు మీ నుంచి దూరంగా వెళతారు. సాయం కోసం ఫోన్ చేసినా వారు సమాధానం ఇవ్వరు. ఇలాంటి 9 చెడు లక్షణాలను కలిగిన వ్యక్తులను మీ జీవితం నుంచి దూరం పెడితేనే మీకు మంచిదని సైకాలజిస్టులు చెబుతున్నారు.

Toxic People: ఇలాంటి వ్యక్తులను మీ జీవితంలోకి అస్సలు రానివ్వొద్దు
Toxic People: ఇలాంటి వ్యక్తులను మీ జీవితంలోకి అస్సలు రానివ్వొద్దు
దిగొచ్చిన ఫుడ్‌ డెలివరీ సంస్థలు.. డెలివరీ బాయ్స్‌కు బంపర్ ఆఫన
దిగొచ్చిన ఫుడ్‌ డెలివరీ సంస్థలు.. డెలివరీ బాయ్స్‌కు బంపర్ ఆఫన
డేంజర్ మాంజా.. ప్రాణాలు తీస్తున్న చైనా దారం.. వారంలోనే 3 ఘటనలు..
డేంజర్ మాంజా.. ప్రాణాలు తీస్తున్న చైనా దారం.. వారంలోనే 3 ఘటనలు..
ఓ AI స్టార్టప్‌ను 2 బిలియన్‌ డాలర్లకు కొనేసిన మెటా..!
ఓ AI స్టార్టప్‌ను 2 బిలియన్‌ డాలర్లకు కొనేసిన మెటా..!
స్టేడియాలు దడదడలాడాల్సిందే.. 2026లో రోహిత్-విరాట్‎ల విశ్వరూపం!
స్టేడియాలు దడదడలాడాల్సిందే.. 2026లో రోహిత్-విరాట్‎ల విశ్వరూపం!
బంగారం, వెండి ధరలు.. 2026 ఎలా ఉండబోతున్నాయో తెలుసా?
బంగారం, వెండి ధరలు.. 2026 ఎలా ఉండబోతున్నాయో తెలుసా?
కొత్త సంవత్సరంలో ఆ రాశుల వారికి ఉద్యోగ ప్రాప్తి గ్యారంటీ..!
కొత్త సంవత్సరంలో ఆ రాశుల వారికి ఉద్యోగ ప్రాప్తి గ్యారంటీ..!
అమ్మాయిలు మీకోసమే.. 25 ఏళ్లకే పెళ్లి.. ఆ తప్పు మాత్రం చేయకండి..
అమ్మాయిలు మీకోసమే.. 25 ఏళ్లకే పెళ్లి.. ఆ తప్పు మాత్రం చేయకండి..
ఇలాంటి మార్కెట్‌ ఎక్కడ చూడలేదు..నడిరోడ్డుపై బంగారం,వెండి అమ్మకాలు
ఇలాంటి మార్కెట్‌ ఎక్కడ చూడలేదు..నడిరోడ్డుపై బంగారం,వెండి అమ్మకాలు
బౌలర్లు బంతులు వేస్తున్నారు..తను మాత్రం సెంచరీలు బాదుతున్నాడు
బౌలర్లు బంతులు వేస్తున్నారు..తను మాత్రం సెంచరీలు బాదుతున్నాడు