AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దిగొచ్చిన ఫుడ్‌ డెలివరీ సంస్థలు.. డెలివరీ బాయ్స్‌కు బంపర్ ఆఫర్.. భారీగా ఇన్సెన్‌టీవ్స్‌ పెంపు!

గిగ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మె, న్యూయర్ డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని జొమాటో, స్విగ్గీ దిగివచ్చాయి. సేవలకు అంతరాయం కలగకుండా డెలివరీ భాగస్వాములకు భారీగా ఇన్సెంటివ్‌లను పెంచాయి. జోమాటో రూ.3,000 వరకు, స్విగ్గీ రూ.10,000 వరకు సంపాదించుకునే అవకాశాలను కల్పించాయి. సమ్మె కారణంగా ఎదురైన ఒత్తిడి కంపెనీల ఈ నిర్ణయానికి దారితీసింది.

దిగొచ్చిన ఫుడ్‌ డెలివరీ సంస్థలు.. డెలివరీ బాయ్స్‌కు బంపర్ ఆఫర్.. భారీగా ఇన్సెన్‌టీవ్స్‌ పెంపు!
Zomato Swiggy Incentives Hike
Anand T
|

Updated on: Dec 31, 2025 | 3:55 PM

Share

గత కొన్ని రోజులుగా తమ డిమాండ్లను పరిష్కరించాలని గిగ్ వర్కర్స్ యూనియన్లు దేశ్యాప్తంగా చేపట్టిన సమ్మెను పట్టించుకోని ఫుడ్ అండ్‌ గ్రోసరీ డెలివరీ సంస్ధలు ఎట్టకేలకు దిగి వచ్చాయి. న్యూయర్ నేపథ్యంలో తమ సేవలలో ఎలాంటి అంతరాయాలు లేకుండా ఉండేందుకు ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లైన జొమాటో, స్విగ్గీ తమ డెలివరీ భాగస్వాములకు భారీగా ఇన్సెన్‌టీవ్‌ను పెంచాయి.

డెలివరీ పాట్నర్ జొమాటో బంపర్ ఆఫర్

న్యూయర్ సందర్భంగా డిసెంబర్ 31 రోజు భారీగా ఆర్డర్లు వచ్చే అవకాశం ఉండడంతో ప్రముఖ ఫుడ్‌డెలివరీ సంస్ధ జొమాటో డెలివరీ పార్ట్‌నర్లకు భారీగా ఆఫర్స్‌ ప్రకటించింది. 31రోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య ఒక్కో ఆర్డర్‌కు రూ.120 నుంచి రూ.150 వరకు చెల్లించేందుకు సిద్ధమైంది. ఆర్డర్ వాల్యూమ్‌లు, కార్మికుల లభ్యతను బట్టి ఒక్క రోజులలో డెలివరీ బాయ్స్ రూ.3,000 వరకు ఆదాయాన్ని పొందవచ్చని జోమాటో పేర్కొంది. అంతేకాదు అదనంగా, జొమాటో ఆర్డర్ స్కిప్‌ చేయడం, రద్దులపై జరిమానాలను కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్టు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

స్విగ్గీ ఆఫర్స్

ఇదిలా ఉండగా అటు స్విగ్గీ కూడా డెలివరీ బాయ్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. 30-12-2025, 01-01-2026 రెండ్రోజుల కలిపి డెలివరీ పార్ట్‌నర్లు రూ.10,000 వరకు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించింది. ముఖ్యంగా డిసెంబర్ 31 సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 12 గంటల మధ్య ఆరు గంటల వ్యవధిలో రూ. 2,000 పేమెంట్ ఆఫర్ చేస్తోంది.

అయితే ఈ నెల‌ 25న క్రిస్మస్ రోజున తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగారాల్లోకి గిగ్‌ వర్కర్లు సమ్మె చేపట్టడంతో ఫుడ్‌ డెలివరీ సంస్థలకు కొన్ని ప్రాంతాల్లో సేవలకు అంతరాయం కలిగింది. అయినా ఆయా సంస్థలు వారిపై సమ్మెపై స్పందించకపోవడంతో ఈరోజు సమ్మెను మరింత ఉదృతం చేశారు గిగ్‌ వర్కర్లు. ఇక చేసేదేమి లేక న్యూయర్ నేపథ్యంలో గిగ్‌ వర్కర్లను ఆకట్టుకునేందుకు ఫుడ్‌ డెలివరీ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.