Araku Trip Guide: అరకు ట్రిప్‌కు ప్లాన్ చేస్తున్నారా?.. ఈ ప్లేస్‌లు అస్సలు మిస్సవ్వకండి.. ఫుల్ గైడ్ మీకోసం!
Araku Valley Winter Trip Guide: రోజూ రొటీన్ లైఫ్‌లో విసుగు చెందారా, అయితే వెంటనే ఆఫీస్‌లో లీవ్ పెట్టండి.. కంప్యూటర్‌లకు దూరంగా.. ప్రకృతికి దగ్గరగా.. ఆకాశం ఎత్తులో పచ్చని కొండల నడుమ గడిపే క్షణాలను మీ సొంతం చేసుకోండి.. ఇందుకు కోసం ఆంధ్ర ఊటీగా పిలువబడే హిల్ స్టేషన్ అరకు వ్యాలీకి వచ్చేయండి. ఈ వింటర్ సీజన్‌లో మీరు వెళ్లే ఈ ట్రిప్ మీరు జీవితంలో మిగిలిపోయే ఓ మదురమైన జ్ఞాపనంగా మిగిలిపోవడం పక్కా.

ఆంధ్ర ఊటీగా పిలువబడే అరకు అందాలను చూడాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ ట్రిప్‌కు ఎలా వెల్లాలి, ఏ సమయంలో వెళ్లాలి, అక్కడ ఏ పర్యాటక ప్రాంతాలను చూడాలని తెలియక చాలా మంది వెనకాడుతుంటారు. కానీ ఇప్పుడు మీరు ఆ టెన్షన్ అక్కడర్లేదు. ఈ ట్రిప్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చ. మీరు అరకు ట్రిప్‌కు ప్లాన్ చేస్తుంటే.. డిసెంబర్- జనవరిలో వెల్లడం చాలా ఉత్తమం. ఈ సీజన్‌లో అక్కడ ప్రకృతి అందాలు మిమ్మల్ని పరువసింపజేస్తాయి. మీ మనస్సుకు ఎంతో హాయిని అందిస్తాయి. కాబట్టి హైదరాబాద్ టూ అరకు ట్రిప్‌కు ఎలా వెళ్లాలో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్ టూ అరకు ఎలా వెళ్లాలి.
హైదరాబాద్ నుంచి అరకు మనం మూడు మార్గాల ద్వారా చేరుకోవచ్చు, బస్సు, ట్రైన్, ఫ్లైట్. అయితే ఫ్లైట్స్ కేవలం విశాఖపట్నం వరకు మాత్రమే ఉంటాయి. అక్కడి నుంచి మీరు బస్సు లేదా ట్రైన్‌లో ప్రయాణించవచ్చు. ఇందుకు కోసం మీరు ముందుగా హైదరాబాద్ నుంచి వైజాగ్ చేరుకోవాలి, అక్కడి నుంచి ప్రతి రోజూ అరకుకు ట్రైన్స్ ఉంటాయి. అయితే మీకు బెస్ట్ ఎక్సీరియన్స్ పొందాలనుకుంటే ట్రైన్‌లో ప్రయాణించడం ఉత్తమం. ఎందుకంటే వైజాగ్ నుంచి అరకు వెళ్లే రైలు ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ మార్గంలో మీరు పచ్చని ప్రకృతి, ఎత్తైన కొండలు, జలపాతాలను వీక్షించవచ్చు. మీరు వైజాగ్ నుంచి అరకు చేరుకునే వరకు సుమారు 65 సొరంగాల గుండా ప్రయాణిస్తారు. ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభవం అవుతుంది.
అరకులో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు
అరకు వ్యాలీ కాఫీ హౌస్
అరకు లోయకు వెళ్ళే ప్రతి ఒక్కరూ ఈ ప్రదేశంలో చాలా ఫేమస్ అయిన కాఫీ హౌస్‌ను చూడాల్సిందే. ముఖ్యంగా, మీరు కాఫీని ఇష్టపడే వారు అయితే ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని చూడాలి. ఈ ప్రదేశం కాఫీతో ప్రత్యేక బంధాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మీరు నిజమైన కాఫీ రుచిని చూడవచ్చు. కావాలనుకుంటే మీరు ఇక్కడ స్వచ్చమైన కాఫీ పౌడర్‌ను కొనుగోలు చేయవచ్చు.
చాపరై జలపాతం
అరకు లోయలో తప్పక సందర్శించాల్సిన ఆకర్షణలలో పర్యాటక ప్రాంతాల్లో చాపరై జలపాతం కూడా ఒకటి. ఈ జలపాతాన్ని డుంబ్రిగుడ జలపాతం అని కూడా పిలుస్తారు. ఈ జలపాతాలు అందంగా చుట్టూ పచ్చని అడవితో చుట్టుముట్టబడి ఉండటం వలన దీనికి మరింత అందం చేకూరుతుంది. ఈ ఉప్పొంగే జలపాతాలు దాని అందంతో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. దీనితో పాటు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి.
బొర్రా గుహలు
అరకు టూర్ వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పక కూడాల్సిన ప్రదేశం బొర్రా గుహల. ఇవి కొన్న వేల సంవత్సరాల పురాతనమైన సున్నపురాయి గుహలు, భారతదేశంలోని అతి పురాతమైన, అత్యంత లోతైన గుహలలో ఇవి కూడా ఒకటి. ఈ గుహల్లో మీరు స్వచ్చమైన సున్నపు రాళ్లను చూడవచ్చు. అక్కడి రాళ్లపై ఇప్పటికే నీటి ఊటలు మీకు కనిపిస్తాయి.
అరకు సమీపంలోని మరిన్ని పర్యాటక ప్రాంతాలు
మీరు ప్రకృతి అందాలు విజిట్ చేసేందు ఇంకాస్త సమయం ఉంటే.. అరకు దగ్గర్లోని మరికొన్ని అద్భుత పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి అవే.. మాడగడ సన్‌రైస్ వ్యూ పాయింట్, లంబసింగి, వనజంగి వ్యూ పాయింట్స్. ఇవి మీకు లైఫ్‌లో బెస్ట్ ఎక్సీరియన్స్‌ను ఇస్తాయి. మీరు ఇక్కడ అద్భుతమైన సన్‌రైజ్‌ను చూడవచ్చు. ఈ ప్రాంతాలకు వెళ్తే మీరు కచ్చితంగా స్వర్గంలో ఉన్టట్టు ఫీల్ అవుతారు. ఇక వేళ మీరు ఫస్ట్ అరకు వెళ్లినట్లయితే.. తొలుత మాడగడ వీవ్‌పాయిట్ చూసుకున్న తర్వాత.. వనజంగి, లంబసింగి వెళ్లండి. ఇక్కడ మీరు అద్భుతమైన సన్‌రైజ్‌ను చూడాలంటే ఉదయం పూర్యోదయం అయ్యేలోపు అక్కడికి చేరుకోవడం చాలా ముఖ్యం.
మరిన్ని టూరిజం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
