Job Horoscope 2026: కొత్త సంవత్సరంలో ఆ రాశుల వారికి ఉద్యోగ ప్రాప్తి గ్యారంటీ..!
Career Horoscope 2026: కొత్త సంవత్సరంలో ఉద్యోగ అన్వేషణ, కెరీర్ ఎదుగుదలపై ఆందోళన చెందుతున్నారా? 2026లో మీ రాశికి ఉద్యోగ, కెరీర్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఇక్కడ విశ్లేషించడం జరిగింది. దశమ స్థానం, దశమాధిపతి ఆధారంగా వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశుల వారికి శుభ వార్తలున్నాయి. కొత్త ఉద్యోగాలు, విదేశీ అవకాశాలు, మంచి కెరీర్ పురోగతిని ఈ జాతకం అంచనా వేస్తుంది.

Job Astrology 2025
కొత్త సంవత్సరంలో ఉద్యోగం లభిస్తుందా? నిరుద్యోగ సమస్య నుంచి బయట పడతామా? మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉందా? విదేశాల్లో ఉద్యోగం దొరికే సూచనలున్నాయా? కోరుకున్న ఉద్యోగం దొరుకుతుందా? ఇటువంటి ఉద్యోగ సంబంధమైన ప్రశ్నలకు సమాధానాలను ఉద్యోగ స్థానాన్ని, అంటే దశమ స్థానాన్ని, దశమాధిపతిని బట్టి చెప్పాల్సి ఉంటుంది. దశమ స్థానం, దశమ స్థానాధిపతిని బట్టి కొన్ని రాశులవారికి ఒకటి రెండు నెలల్లో ఉద్యోగం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకోవడం, శుభ వార్తలు వినడం జరుగుతుంది. అవిః వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీనం.
- వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో రాహువు, లాభ స్థానంలో దశమ స్థానాధిపతి శని బలమైన సంచారం చేస్తున్నందువల్ల వీరికి కొత్త సంవత్సరం ప్రారంభంలో తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. సొంత ఊర్లో ఉద్యోగం లభించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉద్యోగ జీవితంలో తప్పకుండా శీఘ్ర పురోగతి ఉంటుంది. ముఖ్యంగా స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో శనీశ్వరుడి స్థితి వల్ల, దశమాధిపతి గురువు మిథున రాశిలోనే ఉన్నందువల్ల నిరుద్యోగులకు జనవరి 14 తర్వాత నుంచి ముఖ్యమైన ఆఫర్లు, ఆశించిన ఆఫర్లు అందే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించడానికి బాగా అవకాశం ఉంది. కోరుకున్న కంపెనీలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు.
- కర్కాటకం: ఈ రాశికి దశమాధిపతి అయిన కుజుడు జనవరిలో ఉచ్ఛపట్టబోతున్నందువల్ల ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు మార్చిలోగా ఉద్యోగం లభించే అవకాశం ఉంది. దశమ స్థానాధిపతి కుజుడి అను కూలతవల్ల కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగుల కల తప్పకుండా నెరవేరుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు. దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం మారే అవకాశాలు చాలా తక్కువ.
- తుల: ఈ రాశికి దశమ స్థానంలో జూన్ నుంచి ఉచ్ఛగురువు ప్రవేశించబోతున్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. కొత్త ఏడాది మార్చి నుంచి వీరు విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం మంచిది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగులు కూడా కొద్ది ప్రయత్నంతో విదేశీ ఆఫర్లు అందుకోవడం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి కూడా అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశికి దశమ స్థానాధిపతి అయిన శుక్రుడు జనవరి మొదట్లో ఇదే రాశిలోకి ప్రవేశిస్తున్నందు వల్ల ఈ రాశివారికి మంచి జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. శుక్రుడు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధించి ఆశించిన ఉద్యోగం పొందడం జరుగుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. విదేశాలలోని ప్రతిష్ఠాకర సంస్థల నుంచి ఆఫర్లు లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఊహించని పురోగతి ఉంటుంది.
- మీనం: ఈ రాశికి దశమ స్థానం మీద రాశ్యధిపతి గురువు దృష్టి పడడం వల్ల ఈ రాశివారు ఉద్యోగ ప్రయత్నాలను చేపట్టడం మంచిది. జూన్ ప్రాంతంలో వీరికి ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. దశమాధిపతి గురువు జూన్ లో పంచమ స్థానంలో ఉచ్ఛపడుతున్నందువల్ల సాధారణంగా విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఎక్కువగా ఉంది. కొత్త ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నవారు శుభవార్తలు వింటారు.