AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : 25 ఏళ్లకే పెళ్లి.. ఆ తప్పు మాత్రం ఎవరూ చేయకండి.. స్టార్ హీరోయిన్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యం వినిపించే హీరోయిన్లలో ఆమె ఒకరు. ఎక్కువగా స్పెషల్ పాటలతోనే ఫేమస్ అయ్యింది. తెలుగు, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించింది. కానీ ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తలలో నిలుస్తుంది. పెళ్లి, బ్రేకప్ విషయాలతో నెట్టింట నిత్యం ఆమె పేరు మారుమోగుతుంది.

Actress : 25 ఏళ్లకే పెళ్లి.. ఆ తప్పు మాత్రం ఎవరూ చేయకండి.. స్టార్ హీరోయిన్..
Malaika Arora
Rajitha Chanti
|

Updated on: Dec 31, 2025 | 3:04 PM

Share

ప్రస్తుత సమాజంలో అమ్మాయిల ఆలోచన విధానం మారింది. ప్రేమ, పెళ్లి, పిల్లలు కాకుండా.. ముందు జీవితంలో ఫైనాన్షియల్ సెటిల్ ముఖ్యమంటున్నారు. వయసుతో సంబంధమే లేకుండా తమకు నచ్చిన భాగస్వామి వచ్చేవరకు ఎదురుచూస్తుంటారు. అంతకు ముందే తమ కెరీర్ పై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని చెబుతుంది హీరోయిన్ మలైకా అరోరా. అమ్మాయిలు.. చాలా లైఫ్ ఉంది.. వెంటనే పెళ్లి చేసుకోకండి అంటూ సలహాలు ఇస్తుంది. తనకు 25 ఏళ్లకే పెళ్లి అయ్యిందని..ఆ తప్పు మరెవరూ చేయకూడదని అంటుంది మలైకా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఇవి కూడా చదవండి : Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..

“అమ్మాయిలు.. చిన్న వయసులోనే పెళ్లి చేసుకోకుండి.. దయచేసి ఆ తప్పు చేయకండి. నేను అదే తప్పు చేశాను. నా వైవాహిక జీవితంలో జరిగిన అందమైన విషయం ఏంటంటే బిడ్డకు జన్మనివ్వడం. ముందు లైఫ్ ఆస్వాదించండి. స్థిరపడేందుకు కొంత సమయం తీసుకోండి. ఆర్థికంగా, మానసికంగా స్వేచ్ఛ లభించాక జీవితంలో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వండి” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..

అలాగే మలైకా మాట్లాడుతూ.. పెళ్లి అనే సాంప్రదాయాన్ని బలంగా నమ్ముతానని.. కానీ తన విషయంలో మాత్రం అది వర్కవుట్ కాలేదని..అందుకే తాను తన భర్తతో విడిపోయానని తెలిపింది. డివోర్స్ తర్వాత తన లైఫ్ ఆగిపోకుండా ఇంకా ముందుకు సాగిందని.. ప్రస్తుతం తన లైఫ్ తాను ఆస్వాదిస్తున్నానని తెలిపింది. మలైకా అరోరా.. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ పాటలతో ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా షారుఖ్ నటించిన చయ్య చయ్య, కెవ్వు కేక వంటి పాటలతో పాపులర్ అయ్యింది. సల్మా్న్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ను పెళ్లి చేసుకుంది. వీరికి బాబు ఉన్నారు. 2017లో వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది. కానీ కొన్నాళ్లకే ఇద్దరు విడిపోయారు. ప్రస్తుతం తనకంటే వయసులో చిన్న వ్యక్తితో మలైక ప్రేమలో ఉందనే టాక్ వినిపిస్తుంది.

ఇవి కూడా చదవండి :  Actor Suresh: సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. ఒక్క మాటలో చెప్పేసిన సీనియర్ హీరో..

ఇవి కూడా చదవండి :  Folk Song : యూట్యూబ్‏లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..

అమ్మాయిలు మీకోసమే.. 25 ఏళ్లకే పెళ్లి.. ఆ తప్పు మాత్రం చేయకండి..
అమ్మాయిలు మీకోసమే.. 25 ఏళ్లకే పెళ్లి.. ఆ తప్పు మాత్రం చేయకండి..
బౌలర్లు బంతులు వేస్తున్నారు..తను మాత్రం సెంచరీలు బాదుతున్నాడు
బౌలర్లు బంతులు వేస్తున్నారు..తను మాత్రం సెంచరీలు బాదుతున్నాడు
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
వాహనదారులకు బిగ్‌అలర్ట్..వెంటనే మీ మొబైల్‌ నెంబర్ అప్‌డేట్ చేయండి
వాహనదారులకు బిగ్‌అలర్ట్..వెంటనే మీ మొబైల్‌ నెంబర్ అప్‌డేట్ చేయండి
గుడ్‌న్యూస్‌.. ఇక పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు!
గుడ్‌న్యూస్‌.. ఇక పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు!
ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమని ఆమె తల్లి బ్రతిమిలాడింది..
ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమని ఆమె తల్లి బ్రతిమిలాడింది..
రోగిని చితక్కొట్టిన డాక్టర్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!
రోగిని చితక్కొట్టిన డాక్టర్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరు చిన్నారులు బలి!
విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరు చిన్నారులు బలి!
మీ మొబైల్‌లో డార్క్ మోడ్ బ్యాటరీ లైఫ్ పెంచదా? ఆశ్చర్యపోయే కారణాలు
మీ మొబైల్‌లో డార్క్ మోడ్ బ్యాటరీ లైఫ్ పెంచదా? ఆశ్చర్యపోయే కారణాలు