AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డేంజర్ మాంజా.. ప్రాణాలు తీస్తున్న చైనా దారం.. కనిపిస్తే పోలీసులకు చెప్పండి..

బ్యాన్ చేసినా చైనా మాంజా అమ్మకాలు ఆగడం లేదు.. ఎక్కడికక్కడ గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు జరుగుతూ.. వాహనదారుల ప్రాణాలు తీస్తున్నాయి.. తాజాగా.. హైదరాబాద్ దిల్‌సూఖ్‌నగర్‌లో చైనా మంజా తగిలి యువకుడు గొంతు కోసుకున్న సంఘటన కలకలం రేపింది.. ఇలాంటి ప్రమాదాలు తెలంగాణలో తరచూ సంభవిస్తున్నా.. అమ్మకాలు మాత్రం ఆగడం లేదు..

డేంజర్ మాంజా.. ప్రాణాలు తీస్తున్న చైనా దారం.. కనిపిస్తే పోలీసులకు చెప్పండి..
Deadly Chinese Manjha
Sravan Kumar B
| Edited By: |

Updated on: Dec 31, 2025 | 3:26 PM

Share

బ్యాన్ చేసినా చైనా మాంజా అమ్మకాలు ఆగడం లేదు.. ఎక్కడికక్కడ గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు జరుగుతూ.. వాహనదారుల ప్రాణాలు తీస్తున్నాయి.. తాజాగా.. హైదరాబాద్ దిల్‌సూఖ్‌నగర్‌లో చైనా మంజా తగిలి యువకుడు గొంతు కోసుకున్న సంఘటన కలకలం రేపింది.. ఇలాంటి ప్రమాదాలు తెలంగాణలో తరచూ సంభవిస్తున్నా.. అమ్మకాలు మాత్రం ఆగడం లేదు.. చైనా మంజా వల్ల వాహనదారుల గొంతు కట్ అయిన ఘటనలు వారంలో ఇది మూడోసారని అధికారులు తెలిపారు. దిల్‌సూఖ్‌నగర్‌ నుండి సరూర్‌నగర్ వైపు బైక్‌పై వెళ్తున్న అశోక్ అనే యువకుడికి శివగంగా థియేటర్ వద్ద చైనా మంజా గొంతుకు తగిలింది. దీంతో గొంతు లోతుగా కోసుకుపోయి అశోక్ అక్కడికక్కడే కుప్పకూలాడు.. దీంతో అతన్ని స్థానికులు వెంటనే కమలా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత అతను కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు.

డిసెంబర్ 26న చైనా మాంజా మెడకు చుట్టుకోవడంతో మేడ్చల్ జిల్లా కీసర మల్లికార్జున నగర్​కాలనీకి చెందిన బీటెక్ స్టూడెంట్ జశ్వంత్​రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు.. డిసెంబర్ 29న హైదరాబాద్ – శంషీర్‌‌‌‌గంజ్‌‌ ప్రాంతంలో బైక్‌పై వెళ్తుండగా చైనా మాంజా మెడకు తగిలి, గొంతు కోసుకపోయి నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతానికి చెందిన జమీల్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.

గతంలో మల్కాజ్‌గూరి రోడ్డు వద్ద చైనా మంజా కారణంగా ఓ బైకర్ మరణించాడు. మంజా గొంతు, చేతికి తగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది. 2023 అక్టోబర్, కుకట్‌పల్లి లో మార్కెట్ వద్ద ఇద్దరు బైకర్లు గాయపడ్డారు. ఒకరికి కళ్లకు మంజా తగిలి గాయం ఐయ్యింది. 2024 ఉప్పల రోడ్డు వద్ద 10 మంది పైగా ప్రమాదాలు జరిగాయి. చైనా మంజా ఉపయోగం పెరగడంతో ట్రాఫిక్ పోలీసులు, నిరంతరం అప్రమత్తం చేస్తున్నా అమ్మకాలు, ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు..

చైనా మంజా దేనితో తయారు చేస్తారంటే..

చైనా మంజా గాజు పౌడర్ తో కలిపి తయారు చేసిన ప్లాస్టిక్ వైర్. దీనివల్ల వాహనదారుల గొంతు, ముఖం, చేతులు కట్ ఐయ్యి ప్రమాదాలు జరుగుతున్నాయి. తెలంగాణలో సంక్రాంతి, ఉత్సవాల సమయంలో ఎక్కువగా చైనా మాంజా ఉపయోగిస్తారు. ప్రభుత్వం చైనా మాంజా మీద బ్యాన్ విధించినా అక్రమంగా విక్రయాలు కొనసాగుతున్నాయి..

కాగా.. నిరంతరం జరుగుతున్న ప్రమాదాలతో పోలీసులు అప్రమత్తమై.. చైనా మాంజా అమ్మకాలు జరుపుతున్న షాపులపై పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లు కూడా నడుపుతున్నారు. సాంప్రదాయ మంజా ఉపయోగం ప్రోత్సహిస్తున్నా.. చైనా మాంజా అక్రమ రవాణా విక్రయాలు మాత్రం ఆగట్లేదని పలువురు పేర్కొంటున్నారు. చైనా మాంజా అమ్మకాలు జరిపితే.. తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డేంజర్ మాంజా.. ప్రాణాలు తీస్తున్న చైనా దారం.. వారంలోనే 3 ఘటనలు..
డేంజర్ మాంజా.. ప్రాణాలు తీస్తున్న చైనా దారం.. వారంలోనే 3 ఘటనలు..
ఓ AI స్టార్టప్‌ను 2 బిలియన్‌ డాలర్లకు కొనేసిన మెటా..!
ఓ AI స్టార్టప్‌ను 2 బిలియన్‌ డాలర్లకు కొనేసిన మెటా..!
స్టేడియాలు దడదడలాడాల్సిందే.. 2026లో రోహిత్-విరాట్‎ల విశ్వరూపం!
స్టేడియాలు దడదడలాడాల్సిందే.. 2026లో రోహిత్-విరాట్‎ల విశ్వరూపం!
బంగారం, వెండి ధరలు.. 2026 ఎలా ఉండబోతున్నాయో తెలుసా?
బంగారం, వెండి ధరలు.. 2026 ఎలా ఉండబోతున్నాయో తెలుసా?
కొత్త సంవత్సరంలో ఆ రాశుల వారికి ఉద్యోగ ప్రాప్తి గ్యారంటీ..!
కొత్త సంవత్సరంలో ఆ రాశుల వారికి ఉద్యోగ ప్రాప్తి గ్యారంటీ..!
అమ్మాయిలు మీకోసమే.. 25 ఏళ్లకే పెళ్లి.. ఆ తప్పు మాత్రం చేయకండి..
అమ్మాయిలు మీకోసమే.. 25 ఏళ్లకే పెళ్లి.. ఆ తప్పు మాత్రం చేయకండి..
ఇలాంటి మార్కెట్‌ ఎక్కడ చూడలేదు..నడిరోడ్డుపై బంగారం,వెండి అమ్మకాలు
ఇలాంటి మార్కెట్‌ ఎక్కడ చూడలేదు..నడిరోడ్డుపై బంగారం,వెండి అమ్మకాలు
బౌలర్లు బంతులు వేస్తున్నారు..తను మాత్రం సెంచరీలు బాదుతున్నాడు
బౌలర్లు బంతులు వేస్తున్నారు..తను మాత్రం సెంచరీలు బాదుతున్నాడు
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
వాహనదారులకు బిగ్‌అలర్ట్..వెంటనే మీ మొబైల్‌ నెంబర్ అప్‌డేట్ చేయండి
వాహనదారులకు బిగ్‌అలర్ట్..వెంటనే మీ మొబైల్‌ నెంబర్ అప్‌డేట్ చేయండి