Vijay Thalapathy: విజయ్ దళపతి ఎత్తుకున్న అమ్మాయి ఎవరో తెలుసా.. ? టీవీలో చాలా స్పెషల్ ఈ అమ్మడు..
విజయ్ దళపతికి సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో ఈ హీరో ఎత్తుకున్న ఓ అమ్మాయి కనిపిస్తుందా.. ? ఆమె ఇప్పుడు ఫేమస్ నటి. టీవీ రంగంలో తనకంటూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అలాగే నెట్టింట చాలా యాక్టివ్. ఇంతకీ ఆమె ఎవరంటే..

విజయ్ దళపతి క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పిన హీరో… ఇప్పుడు ప్రజా సేవ కోసం ప్రత్యేక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తమిళనాడులో సొంతంగా పార్టీ స్థాపించారు. కొన్ని రోజులుగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న విజయ్.. ఇప్పుడు సినిమాలు తగ్గించేశారు. ప్రస్తుతం ఆయన జన నాయగన్ చిత్రంలో నటిస్తుంది. ఇది విజయ్ చివరి సినిమా కావడం గమనార్హం. ఈ మూవీ తర్వాత తాను రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఇటీవల జననాయగన్ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ లో ప్రకటించారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇప్పుడు విజయ్ కు సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటో నెట్టింట తెగ వైరలవుతుంది. అందులో విజయ్ ఎత్తుకున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి : Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..
పైన ఫోటోలో విజయ్ చేతుల్లో ఉన్న అమ్మాయి పేరు హిమబిందు. చిన్నప్పుడు విజయ్ తో కలిసి దిగిన ఫోటోను నెట్టింట షేర్ చేసింది. ఆమె తమిళంలో వచ్చే ఇలక్కియా అనే సీరియల్ ద్వారా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అలాగే ఇదయతయ్ తిరుదయే అనే సీరియల్ ద్వారా కూడా మంచి ఫేమ్ సంపాదించుకుంది. హిమబిందు ఎక్కువగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. తాజాగా విజయ్ దళపతితో చిన్నప్పుడు దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. “33 సంవత్సరాల మాయాజాలం. ఈ 33 ఏళ్ల ప్రయాణం, ముగింపు గురించి ఆలోచిస్తే నా హృదయం బరువెక్కింది. నేను గర్వపడుతున్నాను. ” అంటూ రాసుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
ప్రస్తుతం హిమబిందు షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఇదిలా ఉంటే.. విజయ్ నటించిన జన నాయగన్ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల చేయనున్నారు. దీంతో ఇప్పుడు విజయ్ ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంటున్నారు.
ఇవి కూడా చదవండి : Actor Suresh: సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. ఒక్క మాటలో చెప్పేసిన సీనియర్ హీరో..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..




