AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

General Sherman Tree: 2,700 ఏళ్లుగా భూమిపై అజేయంగా.. ఏడు నీలి తిమింగిలాల బరువుతో సమానమైన ఏకైక చెట్టు!

ప్రకృతి వైవిధ్యానికి అద్దం పట్టే అద్భుతాలు ఈ భూమిపై ఎన్నో ఉన్నాయి. అందులో అత్యంత ఆశ్చర్యకరమైనది 'జనరల్ షెర్మెన్'. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ చెట్టు వయస్సు 2,200 నుంచి 2,700 సంవత్సరాల మధ్య ఉంటుంది. అంటే రోమన్ సామ్రాజ్యం కంటే ముందు నుండే ఈ చెట్టు భూమిపై ఉంది.

General Sherman Tree: 2,700 ఏళ్లుగా భూమిపై అజేయంగా.. ఏడు నీలి తిమింగిలాల బరువుతో సమానమైన ఏకైక చెట్టు!
General Sherman Tree.jpg
Nikhil
|

Updated on: Feb 17, 2026 | 10:31 PM

Share

అప్పటి పురాతన నాగరికతల నుండి నేటి ఆధునిక సమాజం వరకు అన్ని మార్పులను నిశ్శబ్దంగా చూస్తూ నిలబడిన ఈ వృక్షం వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యాలేంటో తెలుసుకుందాం.. జనరల్ షెర్మెన్ దాదాపు 275 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్టు కాకపోయినా, దీని అసలు రికార్డు కాండం పరిమాణంలో ఉంది. ఈ చెట్టు వైశాల్యం దాదాపు 52,500 క్యూబిక్ అడుగులు. నేలపై దీని కాండం వ్యాసం 36 అడుగులు ఉంటుంది. దీని మొత్తం బరువు దాదాపు 1.27 మిలియన్ కిలోలు.

అంటే ఏడు పెద్ద నీలి తిమింగిలాల బరువుతో ఇది సమానం. వేల ఏళ్లు గడిచినా ఈ చెట్టు వృద్ధాప్యం దరిచేరలేదు. ఇది ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. ప్రతి ఏటా ఒక 60 అడుగుల ఎత్తు ఉన్న మామూలు చెట్టుకు ఎంత కలప ఉంటుందో, అంత కొత్త కలపను ఈ చెట్టు ఉత్పత్తి చేస్తుంది. 2006లో ఈ చెట్టుకు ఉన్న ఒక పెద్ద కొమ్మ విరిగి పడింది. దాని పొడవు 100 అడుగులు, వెడల్పు 7 అడుగులు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ ఒక్క కొమ్మే మన ఊర్లలో ఉండే పెద్ద పెద్ద చెట్ల కంటే భారీగా ఉంది.

అడవిలో చెట్లు కాలిపోవడం లేదా కుళ్ళిపోవడం సహజం. మరి ఈ చెట్టు వేల ఏళ్లుగా ఎలా బతికి ఉంది? దీని వెనుక ప్రకృతి ఇచ్చిన రక్షణ కవచం ఉంది.

  1.  అగ్నిని తట్టుకునే బెరడు: దీని బెరడు 2 అడుగుల మందంగా, పీచుతో ఉంటుంది. ఇది అడవి మంటల నుండి లోపలి పొరలను రక్షిస్తుంది.
  2. టానిన్ రసాయనం: దీని కలపలో ‘టానిన్’ అనే రసాయనం ఎక్కువగా ఉంటుంది. ఇది చెట్టు కుళ్ళిపోకుండా నిరోధిస్తుంది, కీటకాలు దరిచేరకుండా చూస్తుంది. జనరల్ షెర్మెన్ వాల్యూమ్ పరంగా అతిపెద్దది అయితే, వయస్సు పరంగా చిలీలోని ‘గ్రేట్ గ్రాండ్ ఫాదర్’ (5,400 ఏళ్లు) మొదటి స్థానంలో ఉంది. ఎత్తు పరంగా ‘హైపెరియన్’ (380 అడుగులు) అనే కోస్ట్ రెడ్‌వుడ్ ప్రపంచంలోనే నంబర్ వన్. మనిషి జీవిత కాలం వంద ఏళ్లు కూడా దాటడం కష్టమవుతున్న ఈ రోజుల్లో, వేల ఏళ్లుగా స్థిరంగా నిలబడిన జనరల్ షెర్మెన్ మనకు ప్రకృతి గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది. భూమిపై ఉన్న ఈ అమూల్యమైన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

Follow Us
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశాఖలో నేవీ అధికారుల ప్రత్యే విందు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశాఖలో నేవీ అధికారుల ప్రత్యే విందు
కుక్కర్ వాడుతున్నారా! సేఫ్టీ వాల్వ్ ఎప్పుడు మార్చాలో తెలుసా?
కుక్కర్ వాడుతున్నారా! సేఫ్టీ వాల్వ్ ఎప్పుడు మార్చాలో తెలుసా?
పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం!
పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం!
రక్తహీనతను తరిమికొట్టే అమృతం! నేచురల్ ప్రోబయోటిక్.. ఈ ఫుడ్
రక్తహీనతను తరిమికొట్టే అమృతం! నేచురల్ ప్రోబయోటిక్.. ఈ ఫుడ్
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న
ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షం ‘జనరల్ షెర్మెన్’..నాగరికతల పుట్టుకకు
ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షం ‘జనరల్ షెర్మెన్’..నాగరికతల పుట్టుకకు
’నీర్‘ అభయారణ్యం.. కొడుకు సంరక్షణలో బిజీగా బాలీవుడ్ నటి..!
’నీర్‘ అభయారణ్యం.. కొడుకు సంరక్షణలో బిజీగా బాలీవుడ్ నటి..!
హైదరాబాహైదరాబాద్‌‌ద్‌‌లో మెగా డేటా సెంటర్.. సర్కార్ కసరత్తు షురూ!
హైదరాబాహైదరాబాద్‌‌ద్‌‌లో మెగా డేటా సెంటర్.. సర్కార్ కసరత్తు షురూ!
NPSలో మార్పులు.. పెన్షన్‌ ప్లస్‌ హెల్త్‌!
NPSలో మార్పులు.. పెన్షన్‌ ప్లస్‌ హెల్త్‌!
నెదర్లాండ్ తో పోరుకు సూర్యసేన రెడీ.. రెండు మార్పులతో బరిలోకి?
నెదర్లాండ్ తో పోరుకు సూర్యసేన రెడీ.. రెండు మార్పులతో బరిలోకి?