AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రెజర్ కుక్కర్ వాడుతున్నారా? చిన్న పొరపాటు చేస్తే బాంబులా పేలిపోతుందని తెలుసా

వంట గదిలో మహిళలకు అత్యంత ఆప్తమిత్రుడు ఎవరు అంటే ప్రెజర్ కుక్కర్ అని ఠక్కున చెప్పేస్తారు. సమయాన్ని, గ్యాస్‌ను ఆదా చేయడంలో దీనికి సాటి లేదు. కానీ అదే సమయంలో దీనిని సరిగ్గా నిర్వహించకపోతే అది ప్రాణాంతకమైన ప్రమాదాలకు దారి తీస్తుంది.

ప్రెజర్ కుక్కర్ వాడుతున్నారా? చిన్న పొరపాటు చేస్తే బాంబులా పేలిపోతుందని తెలుసా
Pressure Cooker Safety Guide.jpg
Nikhil
|

Updated on: Feb 17, 2026 | 10:56 PM

Share

కుక్కర్లు ఎందుకు పేలుతాయి? ఆ ప్రమాదాల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? అనే విషయాలపై అవగాహన ఉండటం ప్రతి గృహిణికి చాలా ముఖ్యం.

  • ప్రెజర్ కుక్కర్ పని చేసే తీరు చాలా సులభం. లోపల తయారయ్యే ఆవిరి వల్ల కలిగే ఒత్తిడితో ఆహారం త్వరగా ఉడుకుతుంది. ఈ ఆవిరి ఎప్పటికప్పుడు విజిల్ ద్వారా బయటకు వచ్చేయాలి. ఒకవేళ విజిల్ రంధ్రంలో లేదా ఆ వెంట్ పైపులో పప్పు మెతుకులు, అన్నం గింజలు ఇరుక్కుపోతే ఆవిరి లోపలే పేరుకుపోతుంది. అలా ప్రెజర్ విపరీతంగా పెరిగిపోయినప్పుడు, ఆ భారాన్ని తట్టుకోలేక కుక్కర్ ఒక్కసారిగా పేలిపోతుంది. అందుకే వంట మొదలుపెట్టే ముందే విజిల్ రంధ్రం క్లియర్‌గా ఉందో లేదో ఓసారి చెక్ చేసుకోవాలి.
  • త్వరగా పని అయిపోవాలని చాలామంది కుక్కర్ నిండా బియ్యం లేదా పప్పును నింపేస్తుంటారు. ఇవి ఉడికేటప్పుడు పైకి పొంగుతాయి. లోపల గాలి ఆడటానికి తగినంత ఖాళీ లేకపోతే, ఆ పొంగు కాస్తా విజిల్ రంధ్రాన్ని మూసేస్తుంది. అందుకే కుక్కర్‌ను ఎప్పుడూ సగానికి లేదా గరిష్టంగా రెండు వంతుల వరకు మాత్రమే నింపాలి. నీళ్లు కూడా తగిన మోతాదులో పోయాలి. నీళ్లు తక్కువైతే అడుగు మాడిపోవడమే కాదు, లోపల వేడి పెరిగి కుక్కర్ బాడీ బలహీనపడిపోయే ప్రమాదం ఉంది.
  • కుక్కర్ మూతకు ఉండే రబ్బరు పాతబడే కొద్దీ గట్టిపడిపోతుంది. పక్కల నుండి ఆవిరి లీక్ అవుతున్నా చాలామంది ఏదోలా అడ్జస్ట్ చేసి వాడుతుంటారు, ఇది చాలా ప్రమాదకరం. అలాగే మూతపై ఉండే సేఫ్టీ వాల్వ్ విజిల్ పని చేయనప్పుడు కరిగిపోయి ఆవిరిని బయటకు పంపిస్తుంది. ఒకవేళ అది తుప్పు పట్టినా లేదా పాడైపోయినా ప్రమాదం జరిగినప్పుడు అది పని చేయదు. అందుకే ఏడాదికోసారి రబ్బరును, సేఫ్టీ వాల్వ్‌ను మార్చుకోవడం సురక్షితం.

పాటించాల్సిన సూత్రాలు..

  • వంట అయిపోగానే ఆవిరిని బలవంతంగా తీసేయడం లేదా మూతను గట్టిగా లాగడం చేయొద్దు. ఆవిరి పూర్తిగా తగ్గి, విజిల్ దానంతట అదే కిందకు పడే వరకు ఆగాలి.
  • అత్యవసరమైతే కుక్కర్‌ను నల్లా కింద ఉంచి చల్లబరచవచ్చు, అంతేగానీ ఆవిరి ఉండగా మూతను అస్సలు కదిలించకూడదు.
  • పదేళ్లు దాటిన పాత కుక్కర్లను వాడటం కంటే, నాణ్యమైన ఐఎస్ఐ (ISI) మార్క్ ఉన్న కొత్త కుక్కర్లను వాడటమే శ్రేయస్కరం.

టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేస్తుంది, కానీ దానిని వాడే విధానంలో సరైన అవగాహన లేకపోతే ముప్పు తప్పదు. పైన చెప్పిన చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ వంట గదిలో ఎప్పుడూ ప్రశాంతత ఉంటుంది.

Follow Us
కుక్కర్ వాడుతున్నారా! సేఫ్టీ వాల్వ్ ఎప్పుడు మార్చాలో తెలుసా?
కుక్కర్ వాడుతున్నారా! సేఫ్టీ వాల్వ్ ఎప్పుడు మార్చాలో తెలుసా?
పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం!
పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం!
రక్తహీనతను తరిమికొట్టే అమృతం! నేచురల్ ప్రోబయోటిక్.. ఈ ఫుడ్
రక్తహీనతను తరిమికొట్టే అమృతం! నేచురల్ ప్రోబయోటిక్.. ఈ ఫుడ్
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న
ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షం ‘జనరల్ షెర్మెన్’..నాగరికతల పుట్టుకకు
ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షం ‘జనరల్ షెర్మెన్’..నాగరికతల పుట్టుకకు
’నీర్‘ అభయారణ్యం.. కొడుకు సంరక్షణలో బిజీగా బాలీవుడ్ నటి..!
’నీర్‘ అభయారణ్యం.. కొడుకు సంరక్షణలో బిజీగా బాలీవుడ్ నటి..!
హైదరాబాహైదరాబాద్‌‌ద్‌‌లో మెగా డేటా సెంటర్.. సర్కార్ కసరత్తు షురూ!
హైదరాబాహైదరాబాద్‌‌ద్‌‌లో మెగా డేటా సెంటర్.. సర్కార్ కసరత్తు షురూ!
NPSలో మార్పులు.. పెన్షన్‌ ప్లస్‌ హెల్త్‌!
NPSలో మార్పులు.. పెన్షన్‌ ప్లస్‌ హెల్త్‌!
నెదర్లాండ్ తో పోరుకు సూర్యసేన రెడీ.. రెండు మార్పులతో బరిలోకి?
నెదర్లాండ్ తో పోరుకు సూర్యసేన రెడీ.. రెండు మార్పులతో బరిలోకి?
ఈ చిత్రం వెనక ఉన్న చరిత్ర గురించి మీకు తెలుసా?
ఈ చిత్రం వెనక ఉన్న చరిత్ర గురించి మీకు తెలుసా?