AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swathimuthyam: సినిమా ప్రియులకు దీపావళి కానుక.. ఓటీటీలో అడుగుపెట్టిన స్వాతిముత్యం.. ఎక్కడ చూడొచ్చంటే?

థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన స్వాతిముత్యం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది.

Swathimuthyam: సినిమా ప్రియులకు దీపావళి కానుక.. ఓటీటీలో అడుగుపెట్టిన స్వాతిముత్యం.. ఎక్కడ చూడొచ్చంటే?
Swathimuthyam
Basha Shek
|

Updated on: Oct 24, 2022 | 2:00 PM

Share

అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దసరాకు థియేటర్లలో విడుదలైన ఈ క్లీన్‌ కామెడీ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ డీసెంట్‌ హిట్‌గా నిలిచింది. మెగాస్టార్‌ గాడ్‌ఫాదర్‌, అక్కినేని నాగార్జున ఘోస్ట్‌ల పోటీని తట్టుకుని మంచి రెస్పాన్స్‌ అందుకుంది. సితార బ్యానర్‌ పై తెరకెక్కిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటించింది. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించాడు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన స్వాతిముత్యం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. కాగా ముందుగా అక్టోబర్‌ 28 నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్‌ చేయాలనుకున్నారు. అయితే దీపావళి సందర్భంగా నాలుగు రోజులు ముందుగానే అంటే ఇవాళ (అక్టోబర్‌) నుంచే సినిమాను స్ట్రీమింగ్‌ చేస్తోంది.

ఇక స్వాతిముత్యం సినిమా కథ విషయానికొస్తే.. బాల మురళీ కృష్ణ అలియాస్‌ బాల (గణేశ్‌) చుట్టూ తిరుగుతుంది. ఇతను ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్లో పనిచేస్తుంటాడు. పెళ్లి సంబంధం చూడడానికి వెళ్లిన అమ్మాయి భాగ్యలక్ష్మి అలియాస్‌ భాగ్య (వర్ష బొల్లమ్మ) తో ప్రేమలో పడిపోతాడు బాల. వారిద్దరికి పెళ్లి కుదురుతుంది. అయతే పెళ్లి రోజున బాలకి అనుకోకుండా మరో అమ్మాయి నుంచి ఫోన్‌ కాల్‌ వస్తుంది. దీంతో అతని జీవితం మారిపోతుంది. పెళ్లి కూడా ఆగిపోతుంది. అసలు బాల సమస్య ఏంటి? భాగ్యను పెళ్లి చేసుకున్నాడా? అనే విషయాలు తెలియాలంటే మాత్రం స్వాతిముత్యం సినిమాను చూడాల్సిందే. మంచి ట్విస్టులతో సాగే ఈ ఫ్యామిలీ డ్రామాలో సరోగసీ అనే పాయింట్‌ గురించి ప్రస్తావించారు. భావోద్వేగాలు, సున్నితమైన హాస్యంతో ఆద్యంతం ఈ సినిమా ఆకట్టుకుంటుంది. మరి పండగ పూట ఇంట్లోనే ఈ క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ను చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి