Puneeth Rajkumar: విడుదలకు సిద్ధమైన పునీత్ చివరి సినిమా.. కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక సీఎం బొమ్మై

అప్పు నటించిన చివరి చిత్రం గంధన గుడి. పునీత్ రాజ్‌ కుమార్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై పునీత్ సతీమణి అశ్విని పునీత్ రాజ్‌కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

Puneeth Rajkumar: విడుదలకు సిద్ధమైన పునీత్ చివరి సినిమా.. కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక సీఎం బొమ్మై
Cm Basavaraj Bommai
Follow us
Basha Shek

|

Updated on: Oct 24, 2022 | 12:01 PM

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మనల్ని విడిచిపోయి సుమారు ఏడాది కావొస్తోంది. గతేడాది అక్టోబర్‌ 29న జిమ్‌ చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రికి తరలించే లోపే కన్నుమూశారు. అప్పు మన మధ్య లేకపోయినా ఆయన నటించిన సినిమాలు మాత్రం విడుదలవుతున్నాయి. ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఆయన గత సినిమా జేమ్స్‌ సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వద్ద భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.100కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఇప్పుడు మరోసారి సిల్వర్‌స్ర్కీన్‌పై పునీత్ కనిపించనున్నారు. అప్పు నటించిన చివరి చిత్రం గంధన గుడి. పునీత్ రాజ్‌ కుమార్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై పునీత్ సతీమణి అశ్విని పునీత్ రాజ్‌కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పునీత్‌ వర్ధంతికి ఒక్కరోజు ముందు అంటే అక్టోబర్‌ 28న థియేటర్లలోకిఅడుగుపెట్టనుంది. ఈనేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కీలక నిర్ణయం తీసుకున్నారు. గంధన గుడి సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. అప్పు ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచి ఉంటారంటూ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు ముఖ్యమంత్రి.

కేజీఎఫ్‌ రికార్డులు బ్రేక్‌ అవ్వాలి..

గంధన గుడి సినిమాకు అమోఘ వర్ష దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ వేడుకగా జరిగింది. ఈ ఈవెంట్‌కు బసవరాజ్ బొమ్మైతో పాటు కేజీఎఫ్‌ యశ్, రమేశ్ అరవింద్, సాయి కుమార్, సిద్దార్థ్, సూర్య, శరత్ కుమార్, శివ రాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన యశ్‌ గంధన గుడి సినిమా కెజిఎఫ్ నెలకొల్పిన గత రికార్డులన్నింటిని బ్రేక్‌ చేయాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..