T20 World Cup: పాక్‌ పై గెలుపు.. నాన్న త్యాగాన్ని గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకున్న స్టార్‌ ఆల్‌రౌండర్‌

37 బంతుల్లో 40 ( ఫోర్‌, 2 సిక్సర్లు) చేసిన పాండ్యా అంతకుముందు బౌలింగ్‌లోనూ మూడు వికెట్లు నేలకూల్చాడు. కాగా టీమిండియా విజయం అనంతరం ఈ ఆల్‌రౌండర్‌ భావోద్వేగానికి గురయ్యాడు. తన తండ్రిని గుర్తుకు చేసుకుని అందరి ముందే కన్నీళ్లు పెట్టుకున్నాడు.

T20 World Cup: పాక్‌ పై గెలుపు.. నాన్న త్యాగాన్ని గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకున్న స్టార్‌ ఆల్‌రౌండర్‌
Hardik Pandya
Follow us
Basha Shek

|

Updated on: Oct 24, 2022 | 10:24 AM

మెల్‌బోర్న్‌ వేదికగా ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో ఆటగాళ్లతో పాటు అభిమానులందరూ సంతోషంలో మునిగిపోయారు. ముందే దీపావళి వచ్చిందంటూ మురిసిపోయారు. కాగా టీమిండియా విజయంలో విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యా కీలక పత్ర పోషించారు. లక్ష్య ఛేదనలో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంలో ఐదో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు. 37 బంతుల్లో 40 ( ఫోర్‌, 2 సిక్సర్లు) చేసిన పాండ్యా అంతకుముందు బౌలింగ్‌లోనూ మూడు వికెట్లు నేలకూల్చాడు. కాగా టీమిండియా విజయం అనంతరం ఈ ఆల్‌రౌండర్‌ భావోద్వేగానికి గురయ్యాడు. తన తండ్రిని గుర్తుకు చేసుకుని అందరి ముందే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘ఇప్పుడు నేను మా నాన్న గురించే ఆలోచిస్తున్నా. ఆయన నాకు చేసినట్లే నేను నా కుమారుడికి చేయగలనా అని లోచిస్తున్నా. ఎందుకంటే మా క్రికెట్‌ కలను సాకారం చేయడం కోసం మా నాన్న బిజినెస్‌ను వదిలి ఒక నగరం నుంచి మరొక నగరానికి కుటుంబాన్ని తీసుకెళ్లేవాళ్లు. అప్పుడాయన ఇలా మాపై నమ్మకం ఉంచకపోతే నేను, కృనాల్‌ ఈ స్థితిలో ఉండేవాళ్లం కాదు. ఈ త్యాగాలకు ఎంతో రుణపడి ఉన్నాం’ అని ఎమోషనల్‌ అయ్యాడు హార్దిక్‌.

కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో చివరి బంతికి టీమిండియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి159 పరుగులు చేసింది. షాన్‌ మసూద్‌ (52), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (51) రాణించారు. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ (32/3), హార్దిక్‌ పాండ్యా (30/3) పాక్‌ను కట్టడి చేశారు. ఆ తర్వాత ఛేదనకు దిగిన దిగిన భారత జట్టు ఆరంభంలోనే 4 వికెట్లు కోల్పోయింది. అయితే కోహ్లీ, పాండ్యా శతక భాగస్వామ్యంతో చివరి బంతికి విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..