Sourav Ganguly: మరో షాక్‌ ఇచ్చిన గంగూలీ.. క్యాబ్ అధ్యక్ష ఎన్నికల్లోనూ నామినేషన్ వేయని దాదా.. కారణమిదే!

క్యాబ్ ఎన్నికల్లో 2015 నుంచి విపక్ష వర్గం నుంచి నామినేషన్లు దాఖలు చేయకపోవడం సంప్రదాయంగా వస్తుంది. నాటి నుంచి 2019 వరకు క్యాబ్ అధ్యక్షుడిగా సేవలందించాడు బెంగాల్‌ టైగర్‌. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్ష పీఠమెక్కాడు

Sourav Ganguly: మరో షాక్‌ ఇచ్చిన గంగూలీ.. క్యాబ్ అధ్యక్ష ఎన్నికల్లోనూ నామినేషన్ వేయని దాదా.. కారణమిదే!
Sourav Ganguly
Follow us
Basha Shek

|

Updated on: Oct 24, 2022 | 9:05 AM

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ క్రికెట్‌ వర్గాలకు మరో ఊహించని షాక్‌ ఇచ్చాడు. బీసీసీఐ అధ్యక్ష పదవిని వదిలేసిన బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (క్యాబ్) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని  దాదా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నాడు. నామినేషన్లకు చివరి రోజైన ఆదివారం కూడా నామినేషన్ వేయలేదు గంగూలీ. అయితే దీని వెనక ఒక పెద్ద కారణమే ఉందంటున్నాయి క్రికెట్‌ వర్గాలు. తన సోదరుడు స్నేహాశిష్ గంగూలీ కోసమే క్యాబ్‌ అధ్యక్ష పదవిని త్యాగం చేశాడని, అందుకే నామినేషన్‌ వేయలేదంటున్నాయి. కాగా క్యాబ్ ఎన్నికల్లో 2015 నుంచి విపక్ష వర్గం నుంచి నామినేషన్లు దాఖలు చేయకపోవడం సంప్రదాయంగా వస్తుంది. నాటి నుంచి 2019 వరకు క్యాబ్ అధ్యక్షుడిగా సేవలందించాడు బెంగాల్‌ టైగర్‌. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్ష పీఠమెక్కాడు. ఈక్రమంలో ఐసీసీ అధ్యక్షుడి పదవిని అధిరోహిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అదేమీ జరగలేదు. బీసీసీఐ అధ్యక్ష పదవిలోనే ఉండాలని గంగూలీ భావించాడని అయితే బీసీసీఐ పెద్దలు అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. కాగా బీసీసీఐ ప్రెసిడెంట్‌గా దాదా పూర్తిగా విఫలమయ్యాడని, బోర్డు కార్యకలపాల్లో చురుకుగా ఉండటం లేదని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

కాగా గంగూలీ పోటీ నుంచి విరమించుకోవడం, పోటీలో ఎవరూ లేకపోవడంతో దాదా సోదరుడు స్నేహాశిష్ గంగూలీ క్యాబ్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నాడు. మరోవైపు క్యాబ్ ఉపాధ్యక్ష పదవి కోసం ఆమలేందు బిస్వాస్, సెక్రటరీ పదవి కోసం నరేష్ ఓఝా, జాయింట్ సెక్రటరీ పోస్టు కోసం దేబబ్రత దాస్, ట్రెజరర్‌గా ప్రబీర్ చక్రవర్తి నామినేషన్లు వేశారు. ఈ పదవులకు కూడా ఎవరూ నామినేషన్‌ వేయలేదు. దీంతో ఈ పదవులన్నీ ఏకగ్రీవం కానున్నాయి. అయితే కెప్టెన్‌గా అటు జట్టులో, బీసీసీఐ ప్రెసిడెంట్‌గా భారత క్రికెట్‌లో చక్రం తిప్పన గంగూలీకి కూడా బీసీసీఐలో వ్యతిరేక వర్గం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే గంగూలీని కావాలనే బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. రాజకీయాలకు దాదాను బలి చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!