AP High Court Jobs 2022: పదో తరగతి అర్హతతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 439 ప్రాసెస్‌ సర్వర్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైకోర్టు.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 439 ప్రాసెస్‌ సర్వర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల..

AP High Court Jobs 2022: పదో తరగతి అర్హతతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 439 ప్రాసెస్‌ సర్వర్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
Andhra Pradesh
Follow us

|

Updated on: Oct 25, 2022 | 8:53 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 439 ప్రాసెస్‌ సర్వర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా జులై 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 11, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 29వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.800లు, ఎస్సీ/ఎస్టీ, వికలాంగ అభ్యర్ధులు రూ.400లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.23,780ల నుంచి రూ.76,730ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రాత పరీక్ష విధానం..

ఆన్‌లైన్‌ విధానంలో జరిగే రాత పరీక్ష మొత్తం 80 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలకు 80 మార్కుల చొప్పున గంటన్నర వ్యవధిలో రాయవల్సి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్‌ నుంచి 40 ప్రశ్నలు, జనరల్‌ ఇంగ్లిష్ నుంచి 10 ప్రశ్నలు, మెంటల్‌ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలకు సమాధానాలు రాయవల్సి ఉంటుంది.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు..

  • అనంతపురం ఖాళీలు: 30
  • చిత్తూరు ఖాళీలు: 42
  • తూర్పు గోదావరి ఖాళీలు: 26
  • గుంటూరు ఖాళీలు: 72
  • వైఎస్ఆర్ కడప ఖాళీలు: 25
  • కృష్ణా ఖాళీలు: 50
  • కర్నూలు ఖాళీలు: 23
  • ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు ఖాళీలు: 22
  • ప్రకాశం ఖాళీలు: 27
  • శ్రీకాకుళం ఖాళీలు: 49
  • విశాఖపట్నం ఖాళీలు: 40
  • విజయనగరం ఖాళీలు: 22
  • పశ్చిమ గోదావరి ఖాళీలు: 11

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.