AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi University Recruitment 2022: నెలకు రూ.1,80,000ల జీతంతో ఢిల్లీ యూనివర్సిటీలో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలు తప్పనిసరి..

భారత ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని శివాజీ కాలేజ్‌.. 101 టీచింగ్‌ (అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

Delhi University Recruitment 2022: నెలకు రూ.1,80,000ల జీతంతో ఢిల్లీ యూనివర్సిటీలో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలు తప్పనిసరి..
Delhi University Faculty Recruitment 2022
Srilakshmi C
|

Updated on: Oct 25, 2022 | 8:23 AM

Share

భారత ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని శివాజీ కాలేజ్‌.. 101 టీచింగ్‌ (అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బయోకెమిస్ట్రీ, బోటనీ, కామర్స్‌, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్‌, ఇంగ్లిష్, ఎన్విరాన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, జాగ్రఫీ, హిందీ, హిస్టరీ, మ్యాథమెటిక్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, ఫిజిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, సంస్కృతం, సోషియాలజీ, జువాలజీ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

కామర్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌, ఇంగ్లిష్‌, జియాలజీ, హిందీ, హిస్టరీ, మైక్రోబయాలజీ, పొలిటికల్‌ సైన్స్‌, స్టాటిస్టిక్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, బ్యాచిలర్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్ స్టడీస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, మ్యాథమెటిక్స్‌ స్పెషలైజేషన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ/ఎంఫీల్‌/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి. యూజీసీ నెట్‌/సీఎస్‌ఐఆర్‌ నెట్‌లో అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 25 నుంచి 35 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్ 7, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు ఖచ్చితంగా రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.57,700ల నుంచి రూ.1,82,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • బయోకెమిస్ట్రీ: 3
  • బోటనీ: 5
  • కెమిస్ట్రీ: 10
  • కామర్స్‌: 12
  • కంప్యూటర్ సైన్స్: 4
  • ఎకనామిక్స్‌: 5
  • ఇంగ్లీష్: 4
  • ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్: 2
  • జాగ్రఫీ: 5
  • హిందీ: 7
  • హిస్టరీ: 4
  • మ్యాథమెటిక్స్: 6
  • ఫిజికల్ ఎడ్యుకేషన్‌: 1
  • ఫిజిక్స్‌: 12
  • పొలిటికల్ సైన్స్‌: 10
  • సంస్కృతం: 2
  • సోషియాలజీ: 1
  • జువాలజీ: 8

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..
మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!
మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ