AP Govt Jobs 2022: ఇంటర్‌ పాస్‌/ఇంగ్లిష్‌ టైపింగ్‌ స్కిల్స్‌ అర్హతతో.. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో 209 కాపీయిస్టు ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 209 కాపీయిస్టు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల..

AP Govt Jobs 2022: ఇంటర్‌ పాస్‌/ఇంగ్లిష్‌ టైపింగ్‌ స్కిల్స్‌ అర్హతతో.. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో 209 కాపీయిస్టు ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..
AP High Court Copyist Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 26, 2022 | 7:49 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 209 కాపీయిస్టు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే హయ్యర్‌ గ్రేడ్‌ టైప్‌రైటింగ్‌లో అర్హత ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా జులై 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 11, 2022వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.800లు, ఎస్సీ/ఎస్టీ, వికలాంగ అభ్యర్ధులు రూ.400లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.23,780ల నుంచి రూ.76,730ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు.. అనంతపురం ఖాళీలు: 14 చిత్తూరు ఖాళీలు: 22 తూర్పు గోదావరి ఖాళీలు: 25 గుంటూరు ఖాళీలు: 25 వైఎస్ఆర్ కడప ఖాళీలు: 15 కృష్ణా ఖాళీలు: 20 కర్నూలు ఖాళీలు: 7 ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు ఖాళీలు: 10 ప్రకాశం ఖాళీలు: 11 శ్రీకాకుళం ఖాళీలు: 13 విశాఖపట్నం ఖాళీలు: 18 విజయనగరం ఖాళీలు: 10 పశ్చిమ గోదావరి ఖాళీలు: 19

రాత పరీక్ష విధానం..

ఆన్‌లైన్‌ విధానంలో జరిగే రాత పరీక్ష మొత్తం 80 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలకు 80 మార్కులకుగానూ 90 నిముషాల వ్యవధిలో రాతపరీక్ష ఉంటుంది. జనరల్ నాలెడ్జ్‌ నుంచి 40 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లిష్ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!