SAIL Recruitment 2022: రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 261 అప్రెంటిస్ ఖాళీలు.. ఈ అర్హతలుంటే చాలు..
భారత ప్రభుత్వ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలోని రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో.. 261 ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన..
భారత ప్రభుత్వ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలోని రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో.. 261 ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు ఐటీఐ/డిప్లొమా/తత్సమాన సబ్జెక్టులో డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు నవంబర్ 30, 2022వ తేదీ నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 23వ తేదీ నుంచి నవంబర్ 30, 2022వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు లేదా మెరిట్ ప్రాతిపదికన తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
- ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు: 113
- టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు: 107
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు: 41
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.