TS Eamcet: ముగిసిన తెలంగాణ ఎంసెట్‌-2022 సీట్ల కేటాయింపు ప్రక్రియ.. ఈ బ్రాంచ్‌కు పోటెత్తిన విద్యార్ధులు..

తెలంగాణ ఎంసెట్‌-2022 కన్వీనర్‌ కోటాలో మొత్తం 79,346 బీటెక్‌ సీట్లకుగాను చివరి విడతలో మంగళవారం (అక్టోబర్‌ 25) 63,899 మందికి సీట్లు లభించాయి. దీంతో దాదాపు..

TS Eamcet: ముగిసిన తెలంగాణ ఎంసెట్‌-2022 సీట్ల కేటాయింపు ప్రక్రియ.. ఈ బ్రాంచ్‌కు పోటెత్తిన విద్యార్ధులు..
Ts Eamcet 2022 Counseling
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 26, 2022 | 7:32 AM

తెలంగాణ ఎంసెట్‌-2022 కన్వీనర్‌ కోటాలో మొత్తం 79,346 బీటెక్‌ సీట్లకుగాను చివరి విడతలో మంగళవారం (అక్టోబర్‌ 25) 63,899 మందికి సీట్లు లభించాయి. దీంతో దాదాపు 15,447 సీట్లు మిగిలిపోయాయి. సీట్లు పొందిన 63,899 మందిలో చేరే వారు కూడా 55,000లకు మించరన్నది ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ అంచనా వేస్తోంది. ఆ ప్రకారంగా చూస్తే కన్వీనర్‌ కోటాలోనే సుమారు 24 వేల బీటెక్‌ సీట్లు మిగిలిపోనున్నాయి. గతంతో పోల్చుకుంటే ఈసారి చేరే వారి సంఖ్య మూడు వేలు ఎక్కువగానే ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని పలు కాలేజీల్లో సీఎస్‌ఈ సీట్లు పెరగడమే అందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. చివరి విడతలో ఎంపీసీ విద్యార్థులకు 4,025 బీఫార్మసీ సీట్లు అందుబాటులో ఉండగా వాటిలో 60 సీట్లలో మాత్రమే విద్యార్ధులు చేరారు. ఇక చివరి విడతలో సీట్లు పొందిన విద్యార్ధులు అక్టోబర్‌ 28వ తేదీలోపు ఫీజు చెల్లించి, ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. వీరితోపాటు గత రెండు కౌన్సెలింగ్‌లలో సీట్లు పొందిన విద్యార్ధులు అంటే ఎంసెట్‌లో సీట్లు పొందినవారందరూ తమకు సీట్లు కేటాయించిన కాలేజీలకు వెళ్లి ఒరిజినల్‌ టీసీతోపాటు ఇతర సంబంధించి జిరాక్స్‌ సర్టిఫికేట్లను సమర్పించవల్సి ఉంటుంది.

16 ప్రభుత్వ కళాశాలల్లో ఈసారి మొత్తం 4,914 బీటెక్‌ సీట్లు ఉండగా వాటిల్లో 3,771 మాత్రమే నిండాయి. 1143 (23శాతం) సీట్లు ఖాళీగానే ఉన్నాయి. బ్రాంచ్‌ల వారీగా చూస్తే.. సీఎస్‌ఈ బ్రాంచ్‌లలో 49, 031 సీట్లకు గాను 45,775 భర్తీ అయ్యాయి. వీటిల్లో 3,256 సీట్లు మిగిలిపోయాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌లలో 18,825 సీట్లు ఉండగా 14,265 సీట్లు భర్తీ అయ్యాయి. వీటిల్లో 4,560 మిగిలాయి. సివిల్, మెకానిక్ బ్రాంచ్‌లలో మొత్తం 10,286 సీట్లకు 3,328 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 6,958 సీట్లు మిగిలిపోయాయి. ఈ ఏడాది ఇన్ని వేల సీట్లు ఎందుకు ఖాళీగా మిగిలిపోయాయనే విషయంపై పలువురు విద్యావేత్తలు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఈ ఏడాది ఇంజనీరింగ్‌ ఫీజులు భారీగా పెరిగిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.