Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajnath Singh: ఉక్రెయిన్ వైఖరిపై రాజ్ నాధ్ సింగ్ కు రష్యా రక్షణమంత్రి ఫోన్.. ఆ విషయంలో హెచ్చరించిన భారత రక్షణ మంత్రి

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం వేళ.. ఉక్రెయిన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని రష్యా ఆరోపిస్తోంది. ఉక్రెయిన్‌ డర్టీ బాంబ్‌ ను వాడినట్లు రష్యా చెబుతోంది. సంప్రదాయ పేలుడు పదార్ధాలతో అణుధార్మికత కలిగిన డర్టీ బాంబును ఉక్రెయిన్‌ రూపొందిస్తున్నట్లు రష్యా ఆరోపించింది. ఈ అంశంపై భారత..

Rajnath Singh: ఉక్రెయిన్ వైఖరిపై రాజ్ నాధ్ సింగ్ కు రష్యా రక్షణమంత్రి ఫోన్.. ఆ విషయంలో హెచ్చరించిన భారత రక్షణ మంత్రి
Russian Defence Minister Sergei Shoigu, Defence Minister Rajnath Singh (File Photo)
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 26, 2022 | 9:11 PM

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం వేళ.. ఉక్రెయిన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని రష్యా ఆరోపిస్తోంది. ఉక్రెయిన్‌ డర్టీ బాంబ్‌ ను వాడినట్లు రష్యా చెబుతోంది. సంప్రదాయ పేలుడు పదార్ధాలతో అణుధార్మికత కలిగిన డర్టీ బాంబును ఉక్రెయిన్‌ రూపొందిస్తున్నట్లు రష్యా ఆరోపించింది. ఈ అంశంపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోగూ ఫోన్ లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాలపై సెర్గీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ రెచ్చగొడుతున్నట్లు ఆయన రాజ్‌నాథ్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. డర్టీ బాంబు గురించి రష్యా రక్షణ మంత్రి సెర్గీ నాటో దేశాల రక్షణ మంత్రులతో మాట్లాడారు. కానీ ఉక్రెయిన్‌తో పాటు పశ్చిమ దేశాలు ఆ ఆరోపణలను తోసిపుచ్చుతున్నాయి. రేడియోయాక్టివ్‌ డర్టీ బాంబును వాడేందుకు ఉక్రెయిన్‌ సిద్ధంగా ఉన్నట్లు రష్యా చేస్తున్న ఆరోపణల్ని నాటో దేశాలు ఖండించాయి. రష్యానే ఆ బాంబును వాడనున్నట్లు నాటో దేశాలు ప్రత్యారోపణలు చేశాయి. ఇలా ఉండగా ఉక్రెయిన్‌ యుద్ధంలో ఎవరు కూడా అణ్వాయుధాలను వాడరాదు అని సెర్గీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ తెలిపారు. న్యూక్లియర్‌ లేదా రేడియోలాజికల్‌ వెపన్స్‌ వాడడం అంటే అది మానవాళికి విరుద్దమే అని రాజ్‌నాథ్‌ సింగ్ రష్యా రక్షణమంత్రితో సంభాషణ సందర్భంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. సంప్రదింపులు, దౌత్యం ద్వారా సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలని రాజ్‌నాథ్‌ సింగ్ సూచించారు.

అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ(ఐఏఈఏ) ఉక్రెయిన్‌లో ఇన్‌స్పెక్షన్‌కు వెళ్లనున్న సమయంలో.. డర్టీ బాంబు ప్రణాళికల్ని ఉక్రెయిన్‌ గోప్యంగా ఉంచుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌ డర్టీ బాంబును వాడే అవకాశాలు మెండుగా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ డర్టీబాంబు వాడితే అది అణ్వాయుధ ఉగ్రవాదమే అవుతుందని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది.

ఇవి కూడా చదవండి

ణు లేదా రేడియోలాజికల్ ఆయుధాల వినియోగం మానవ హక్కుల ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నందున అణ్వాయుధాలను ఏదేశమూ ఉపయోగించకూడదని రాజ్ నాధ్ సింగ్ సూచించారు. దాదాపు రెండు వారాల క్రితం క్రిమియాలో జరిగిన భారీ పేలుడుకు ప్రతిస్పందనగా రష్యా ఉక్రేనియన్ లోని పలు నగరాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు చేయడంతో రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదం మరింత తీవ్రమైంది. కాగా ఉక్రెయిన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, అన్ని దేశాలు తమకు సహకరించాలని రష్యా కోరే ప్రయత్నం చేస్తుంది. అయితే అన్వాయుధాల ఉపయోగించే విషయమై అమెరికా ఇప్పటికే రష్యాను హెచ్చరించింది. అణు యుద్ధానికి కాలుదువ్వితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన నేపథ్యంలో భారత రక్షణమంత్రి రాజ్ నాధ్ సింగ్ కూడా అణ్వాయుధాలను ఉపయోగించవద్దని రష్యాను హెచ్చరించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..