AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Sidiri on JSP: కార్యకర్త నుంచి మంత్రి స్థాయికి చేరుకున్నా.. మరి నువ్వెందుకు ఎమ్మెల్యేగా.. మంత్రి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు..

చంద్రబాబు నాటకాలపై అవగాహన లేక ఆయన ఏం చెబితే అది పవన్ చేస్తున్నారని చెప్పారు. ప్రజల కడుపు మంటతో డిమాండ్ చేస్తోన్న మూడు రాజధానులు.. పవన్ కళ్యాణ్ చేసుకున్న మూడు పెళ్లిల్లతో సమానమా అని పవన్ ని నిలదీసారు మంత్రి సీడిరి అప్పలరాజు.

Minister Sidiri on JSP: కార్యకర్త నుంచి మంత్రి స్థాయికి చేరుకున్నా.. మరి నువ్వెందుకు ఎమ్మెల్యేగా.. మంత్రి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు..
Appalaraju Pawan Kalyan
Surya Kala
|

Updated on: Oct 17, 2022 | 8:43 AM

Share

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మ౦త్రి సీదిరి అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పవన్ కల్యాణ్ రెండు రోజులుగా చేసిన హంగామా టిడిపి ఆఫీసులో తయారైన స్క్రిప్టు అని ఆరోపించారు. ఆయన కారులో కూర్చోడానికి, కారులో నిలబడటానికి, అభివాద౦ చెయ్యటానికి ఒక్కొక్కదానికి ఒక్కో రేటు ఉంటుందన్నారు. నేషనల్, స్టేట్ మీడియాలో విశాఖ గర్జనపై రోజంతా నినదిస్తే… ఆ స్ఫూర్తిని డైవర్ట్ చేయాలని కుట్ర పన్నారని మ౦డిపడ్డారు. చంద్రబాబు నాటకాలపై అవగాహన లేక ఆయన ఏం చెబితే అది పవన్ చేస్తున్నారని చెప్పారు. ప్రజల కడుపు మంటతో డిమాండ్ చేస్తోన్న మూడు రాజధానులు.. పవన్ కళ్యాణ్ చేసుకున్న మూడు పెళ్లిల్లతో సమానమా అని పవన్ ని నిలదీసారు మంత్రి సీడిరి అప్పలరాజు.

జన సైనికుల కష్టాన్ని, ఆకాంక్షని పవన్ కళ్యాణ్ ని ఎవరికో తాకట్టుపెట్టేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. జనసైనికులకు అది గమనించాలని సూచించారు. ఇంకా ప్యాకేజీలు, ఈవెంట్ రాజకీయాలతో ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తావంటూ పవన్ కళ్యాణ్ ను  ప్రశ్నించారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా వైసీపీ లో చేరి జగనన్  సూచనలు, కార్యక్రమాలతో తాను ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేసుకున్నారు. మరి మీరెందుకు ఎమ్మెల్యేగా గెలవలేకపోతున్నారో రీసెర్చ్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ ను కోరారు సీదిరి అప్పలరాజు.

Reporter: S.Srinivas

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..