Chandrababu on JSP: జనసేన నేతల అరెస్ట్ అక్రమం అన్న చంద్రబాబు.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రలు దారుణమని అన్నారు. పవన్ కళ్యాణ్ బస చేస్తున్న హోటల్ లో సోదాలు నిర్వహించడం, నాయకులను బెదిరించడం నియంత పాలనకు నిదర్శనమని చెప్పారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా జనసేనాని శనివారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. పలువురి జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ప్రభుత్వం తీరుని పోలీసుల ప్రవర్తనను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తప్పు పట్టారు. జనసేన నేతల అరెస్ట్ లను చంద్రబాబు ఖండించారు. విశాఖలో వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రలు దారుణమని అన్నారు. పవన్ కళ్యాణ్ బస చేస్తున్న హోటల్ లో సోదాలు నిర్వహించడం, నాయకులను బెదిరించడం నియంత పాలనకు నిదర్శనమని చెప్పారు. విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన పేరుతో పదుల సంఖ్యలో అక్రమంగా అరెస్ట్ చేసిన జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ ర్యాలీకి అనుమతి అడిగిన నేతలపై హత్యాహత్నం సెక్షన్ ల కింద కేసులు పెట్టి అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని పేర్కొన్నారు. ఒక పార్టీ అధినేత కారులో కూర్చోవాలో… బయటకు వచ్చి అభివాదం చేయాలో కూడా పోలీసులే నిర్ణయిస్తారా అంటూ పోలీసుల తీరుని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు.
Reporter: MP Rao
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..