AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konaseema: పులకించిన ప్రకృతి.. కోనసీమలో సాయం సంధ్యవేళ కనువిందు చేసిన ఇంద్రధనుస్సు..

ఇంద్రధనస్సు ఎక్కడ కనిపించినా పిల్లలు, పెద్దలు ఎంతో సంతోషంగా వీక్షిస్తారు.. మరి అలాంటి సప్తవర్ణాల ఇంద్రధనుస్సు గోదారి తీరంలో కొబ్బరి ఆకుల మధ్య కనువిందు చేస్తే.. ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి..

Konaseema: పులకించిన ప్రకృతి.. కోనసీమలో సాయం సంధ్యవేళ కనువిందు చేసిన ఇంద్రధనుస్సు..
Konaseema Rainbow
Surya Kala
|

Updated on: Oct 09, 2022 | 12:33 PM

Share

హరివిల్లు, చిరుజల్లు, చుక్కలు, ఆకాశం.. అన్నీ అందరి కోసం అని ఓ సినీ కవి వర్ణిస్తే.. ఆకాశంలో అందమైన రంగు రంగుల చాపం ఇంద్ర ధనుస్సు అని మరొకొందరు తమ సంతోషన్ని వ్యక్తం చేస్తారు. సప్తవర్ణాలను ఏకమై.. ఆకాశంలో అర్ధవృత్తాకారంలో రెండు అంచులూ భూమిలో ఉన్నట్టు.. వృత్తాకారం అంబరాన్ని తాకుతున్నట్లు కనిపిస్తూ కనులవిందు చేస్తుంది ఇంద్రధనస్సు. సూర్య రశ్మితో తయారయ్యే ఈ ఇంద్రధనుస్సు.. ఎప్పుడూ సూర్యునికి వ్యతిరేక దిశలోనే కనిపిస్తుంది. అయితే ఈ ఇంద్రధనస్సు ఎక్కడ కనిపించినా పిల్లలు, పెద్దలు ఎంతో సంతోషంగా వీక్షిస్తారు.. మరి అలాంటి సప్తవర్ణాల ఇంద్రధనుస్సు గోదారి తీరంలో కొబ్బరి ఆకుల మధ్య కనువిందు చేస్తే.. ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి.. మరి అలాంటి దృశ్యం కోనసీమలో ఆవిష్కృతం అయింది. వివరాలోకి వెళ్తే..

పచ్చని ప్రకృతి.. అందాలకు పుట్టినిల్లు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అద్భుతం చోటుచేసుకుంది. సాయం సంధ్యవేళ ఆకాశంలో సప్తవర్ణాల ఇంద్రధనుస్సు కనువిందు చేసింది. మామిడికుదురు మండలం పాశర్లపూడిలంకలో ఈ దృశ్యం కనిపించింది. పచ్చని కొబ్బరి చెట్ల నడుమ ఆక్వా చెరువు మీదుగా ఆకాశంలో ఇంద్రధనుస్సుఅద్భుతంగా దర్శనమిచ్చింది. ఆ హరివిల్లు అందాలకు ప్రకృతి సైతం పులకించింది. సాయం సంధ్యవేళ ఈ ఇంద్ర ధనుస్సు అందాలకు చెరువులోని చేపలు సందడి చేసాయి.

ఇవి కూడా చదవండి

అయితే రంగుల అమరికను బట్టీ ఇంద్రధనుస్సుని రెండు రకాలుగా అభివర్ణించారు. మొదటిది ప్రాధమిక ఇంద్రధనుస్సు.. ఇందులో    వృత్తం పై భాగంలో ఎరుపు,, లోపలి భాగంలో ఊదా రంగులో ఉంటాయి. రెండది ద్వితీయ ఇంద్రధనుస్సు ఇందులో ప్రాథమిక ఇంద్రధనుస్సులోని వర్ణాలు తిరగేసి దర్శనమిస్తాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ