Sharad Purnima: కాముని పున్నమి రోజున 16 కళలతో ప్రకాశించే చంద్రుడు.. నేడు వెన్నెలలో పాయసం పెట్టి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

అమ్మవారి ఆరాధన దేవి నవరాత్రులు 9 రోజులు చేస్తారు. అయితే దేవీ ఉపాసకులు మాత్రం దుర్గాదేవిని ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఇక ఈరోజు చంద్రుడిని కూడా విశేషంగా పూజిస్తారు.

Sharad Purnima: కాముని పున్నమి రోజున 16 కళలతో ప్రకాశించే చంద్రుడు.. నేడు వెన్నెలలో పాయసం పెట్టి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
Sharad Purnima
Follow us
Surya Kala

|

Updated on: Oct 09, 2022 | 12:06 PM

సనాతన హిందూ సంప్రదాయంలో పండగలు, పర్వదినాలు జరుపుకునే విధానం ఆయా సీజనల్ కు అనుగుణంగా ఉంటుంది. హిందువుల పండగలు జరుపుకునే నియమాల్లో శాస్త్రీయకోణాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. నేడు శరత్ పూర్ణిమ.. ఆశ్వీయుజ మాసంలోని వచ్చే పూర్ణమిని శరత్ పూర్ణిమ లేదా కాముని పున్నమి అని అంటారు. అమృతం కోసం పాల సముద్రాన్ని మధిస్తున్న సమయంలో ఈరోజు లక్ష్మీదేవి జన్మించిందని పురాణాల కథనం. అందుకనే ఈరోజు అమ్మవారి ఆరాధనకు విశేషమైన రోజుగా పరిగణిస్తారు. ముఖ్యంగా సాధారణ ప్రజలు.. అమ్మవారి ఆరాధన దేవి నవరాత్రులు 9 రోజులు చేస్తారు. అయితే దేవీ ఉపాసకులు మాత్రం దుర్గాదేవిని ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఇక ఈరోజు చంద్రుడిని కూడా విశేషంగా పూజిస్తారు.

లక్ష్మీదేవికి సోదరుడైన చంద్రుడు శరత్ పూర్ణిమ నాడు మాత్రమే 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువలన ఈ రోజు చంద్రుడిని పూజిస్తారు. ఈరోజున చందకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరిక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయని నమ్మకం. అందుకనే నేడు  పున్నమి వెన్నెలలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేస్తారు. ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి, ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెప్తోంది. వెన్నెలలో పెట్టిన పరమాన్నం చంద్రకిరణాల్లో ఉన్న ఓషిధీతత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుందని.. మర్నాడు ఆ పరమాన్నం కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించడం వలన అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని పెద్దల నమ్మకం

విష్ణువు అవతారాల్లో ఒకరైన కృష్ణుడు పరిపూర్ణావతారం. ఆయనలో 16 కళలున్నాయి. అందుకనే బృందావనంలో ఈ శరత్ పూర్ణిమను రాస పూర్ణిమ అంటారు. ఈ రోజే శ్రీ కృష్ణుడు మహారాసలీల సలిపాడట. కృష్నుడి వేణుగానం విన్న కొన్ని వేల మంది గోపికలు.. అనీ వదిలేసి కన్నయ్య కోసం ఈ పున్నమి రోజున నాట్యం చేసారని పురాణాల కథనం.  ఈరోజు మధుర, బృందావనంలో విశేష పూజలను నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)