AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల చరిత్రలో తొలిసారి 4 కి.మీ. మేర భక్తులతో క్యూ లైన్.. వసతి కోసం శ్రీవారి భక్తుల అవస్థలు..

ఉచిత దర్శనం కోసం క్యూ లైన్ లో ఉన్నవారికి దాదాపు 48 గంటల సమయం పడుతుంది. రూ. 300  ప్రత్యేక ప్రవేశ దర్శనం 5 గంటలకు పైగా పడుతుంది.

Tirumala: తిరుమల చరిత్రలో తొలిసారి 4 కి.మీ. మేర భక్తులతో క్యూ లైన్.. వసతి కోసం శ్రీవారి భక్తుల అవస్థలు..
Tirumala Rush
Surya Kala
|

Updated on: Oct 09, 2022 | 8:48 AM

Share

కలియుదైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతి ఒక్క హిందువు కోరుకుంటాడు. క్షేత్రానికి పండగలు, పర్వదినం సమయంలోనే కాదు.. సెలవులు దొరికితే చాలు.. తిరుమలకు చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ విదేశాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే ప్రస్తుతం స్వామివారి క్షేత్రం భారీ సంఖ్యలో భక్తుల రద్దీ నెలకొంది. ఓ వైపు వారాంతపు సెలవులు మరోవైపు పవిత్రమైన పెరటాసి మాసం కారణంగా తమిళనాడు నుండి  అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో గత రెండు రోజులుగా తిరుమలలో యాత్రికుల సంఖ్య అధికంగా ఉంది. నగర ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గోగర్భం డ్యాం దగ్గర క్యూ లైన్‌ను పరిశీలించి దర్శనం కోసం లైన్‌లో వేచి ఉన్న భక్తులతో కాసేపు మాట్లాడారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకుల వాలంటీర్లతో కలసి భోజనం, నీరు పంపిణీ చేశారు. పవిత్ర పెరటాసి మాసం వంటి వివిధ కారణాల వల్ల రద్దీ అనూహ్యంగా ఉందని… స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలో వేచి చూస్తున్నారని.. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ యాత్రికులు స్వామి దర్శనం కోసం ఓపికగా నిరీక్షించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు.

మరోవైపు గంటల తరబడి స్వామివారి దర్శనం కోసం ఎదురు చేస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు భోజనం, మంచినీరు అందించేందుకు టీటీడీ యాజమాన్యం విస్త్రృతంగా ఏర్పాట్లు చేసింది.

స్వామివారి భక్తులతో వెయింట్ హాల్స్ పూర్తిగా నిండిపోయాయి. దీంతో క్యూ కాంప్లెక్స్ వెలుపల నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర గోగర్భం ఆనకట్ట వరకు భక్తులతో క్యూ లైన్ విస్తరించాయి. ఇలా జరగడం తిరుమల చరిత్రలో ఇదే తొలిసారి అని టీటీడీ అధికారులు చెప్పారు. లైన్లలో వేచి ఉన్న భక్తులకు సౌకర్యంగా ఉండేలా టీటీడీ చర్యలు తీసుకుంటుంది.  ఉచిత దర్శనం కోసం క్యూ లైన్ లో ఉన్నవారికి దాదాపు 48 గంటల సమయం పడుతుంది. రూ. 300  ప్రత్యేక ప్రవేశ దర్శనం 5 గంటలకు పైగా పడుతుంది

ఇవి కూడా చదవండి

కొండపై ఉన్న యాత్రికుల వసతి సముదాయాలన్నీ భక్తులతో నిండిపోయాయి.  దీంతో భక్తులు వసతి కోసం అవస్థలు పడుతున్నారు. గదులు ఖాళీ లేకపోవడంతో శ్రీవారి భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇదే విధంగా మరో నాలుగు రోజుల పాటు భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. బుధవారం నుండి సెలవు దినం కారణంగా యాత్రికుల రద్దీ పెరగడం ప్రారంభమైంది. భక్తులు ఈ పరిస్థితులు గమనించి తగు ఏర్పాట్లు చేసుకోగలరని టీటీడీ సిబ్బంది కోరారు. మరోవైపు అలిపిరి వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..