Weekly Horoscope: ఈ వారంలో ఈ రాశివారు కొత్త ఇంటి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు.. అక్టోబర్ 9 నుంచి 15 వరకూ రాశిఫలాలు

తమ నామ నక్షత్ర ప్రకారం, లేక జన్మ నక్షత్ర ప్రకారం  వార ఫలాలను తెలుసుకోవాలనుకుంటారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి (9వ తేదీ అక్టోబర్) నుంచి శనివారం అంటే (15వ తేదీ అక్టోబర్) వరకూ ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో తెలుసుకుందాం.. 

Weekly Horoscope: ఈ వారంలో ఈ రాశివారు కొత్త ఇంటి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు.. అక్టోబర్ 9 నుంచి 15 వరకూ రాశిఫలాలు
Weekly Horoscope
Follow us
Surya Kala

|

Updated on: Oct 09, 2022 | 7:21 AM

జాతకాలను నమ్మేవారు మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. కొంతమంది రాశిఫలాలను ఆధారంగా తాము చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా జరుగుతాయో లేదో తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. దీంతో తమ నామ నక్షత్ర ప్రకారం, లేక జన్మ నక్షత్ర ప్రకారం  వార ఫలాలను తెలుసుకోవాలనుకుంటారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి (9వ తేదీ అక్టోబర్) నుంచి శనివారం అంటే (15వ తేదీ అక్టోబర్) వరకూ ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో తెలుసుకుందాం..

  1. మేష రాశి: ఈ వారంలో ఈ రాశివారికి ఓర్పు అవసరం. నూతన ఆలోచనలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. మీ సహనానికి పరీక్ష పెట్టె వ్యక్తులున్నారు. ఉద్యోగంలో శుభఫలితాలుంటాయి. తెలియని వ్యక్తులతో తగిన జాగ్రత్త తీసుకుని మెలగాల్సి ఉంది. స్నేహితుల వలన సంతోషంగా గడుపుతారు.
  2. వృషభ రాశి:  ఈ వారంలో ఈ రాశివారికి తగిన గౌరవం లభిస్తుంది. ఆర్ధిక స్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు మంచి జీతం లభిస్తుంది. ఆశయాలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తారు. మీరు చేపట్టిన పనులు అందరి మన్ననలు పొందుతారు. కొత్త ఇంటి కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. కాలం అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు, బంధువులు సహకారం లభిస్తుంది. సమాజంలో  తగిన గౌరవం లభిస్తుంది.
  3. మిథున రాశి: ఈ రాశివారికి అన్ని విధాలా అనుకూల పరిస్థితులను ఏర్పడతాయి. చేపట్టిన పనుల విషయంలో అలోచించి అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది.  ముఖ్యమైన పనులను శ్రద్ధ పెట్టి పూర్తి చేయాల్సి ఉంటుంది. కొత్త ఆలోచనలు, ప్రణాళికలతో కెరీర్ లో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. స్థిరమైన భవిష్యత్తునిచ్చే విధంగా కొత్త పనులను చేపట్టాల్సి ఉంటుంది.
  4. కర్కాటక రాశి:  ఈ రాశి వారు ధన లాభం పొందుతారు. వ్యాపారంలో ఆటంకాలున్నప్పటికీ దైర్యంగా ముందడుగు వేయాల్సి ఉంటుంది. శుభకాలం. ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. సమస్య నుంచి బయటపడి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కొత్తపెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహ రాశి: ఈ వారంలో ఈ రాశివారు వ్యాపారాభివృద్ధిని సాధిస్తారు. లక్ష్యం చేరుకునే విధంగా నిర్ణయాలను తీసుకుంటారు. సంపదలు పెరుగుతాయి. చేపట్టిన పనులను మధ్యలో ఆపకుండా పూర్తి చేసే ప్రయత్నాలు చేయండి.  బంధుమిత్రులతో తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. నూతన ప్రయత్నాలు లాభిస్తాయి. ప్రయత్నబలం ఉంటే తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. సంపద పెరుగుతుంది. అందరితో కలిసి సమష్టిగా చేసే పనులు లాభాలను ఇస్తాయి.
  7. కన్య రాశి: ఈ రాశివారు ఈ వారంలో అదృష్ట ఫలాలను అందుకుంటారు. ఆటంకాలు ఎదురైనా పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషముగా గడుపుతారు. చేపట్టిన పనులను వాయిదా వేయకుండా పూర్తి చేయాలి. బాధ్యతలను సంక్రమంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషముగా గడుపుతారు. ఉద్యోగరీత్యా అనుకూల కాలం. చాకచక్యంగా వ్యవహరించాలి. బాధ్యతలను సక్రమంగా పూర్తిచేయాలి.
  8. తుల రాశి: ఈ రాశివారికి ఈ వారంలో వ్యాపారంలో జాగ్రత్త అవసరం.. అన్ని చోట్లా ఆటంకాలను ఎదుర్కొంటారు. ఉద్యోగంలో ఆటంకాలు తొలగి ముందుకు వెళ్లారు.  కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలతో మంచి నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏకాగ్రతతో పని చేయాలి.  నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరమైన ఆలోచనలతో కొన్ని ఇబ్బందులు రావచ్చు. స్నేహితులతో అపార్థాలకు తావివ్వవద్దు.
  9. వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈ వారం ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. కాలం సహకారంతో ఆర్ధికంగా కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. స్థిర నిర్ణయాలను తీసుకోవడం మేలు చేస్తుంది. ఆర్ధికంగా శుభఫలితాలను అందుకుంటారు. ఆపద నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. మిత్రులవల్ల మంచి జరుగుతుంది.
  10. ధనుస్సు రాశి: ఈ రాశివారు ఈ వారంలో ప్రతిభతో అభివృద్ధిని సాధిస్తారు. పట్టుదలతో పని చేయాల్సి ఉంటుంది. అన్నింటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో తగినంత గుర్తింపు లభిస్తుంది. కొన్ని పనులు అధిక శ్రమతో  పూర్తి చేస్తారు.    బంధుమిత్రుల ప్రశంసలు లభిస్తాయి. అనుకున్నది సాధించే కాలమిది. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తారు. ధనధాన్య లాభాలను అందుకుంటారు.
  11. మకర రాశి: రాశివారు ఈ వారంలో ప్రతిభతో పెద్దలను ఆకట్టుకుంటారు. సమిష్టి కృషితో కుటుంబానికి మేలు చేస్తారు. ఉద్యోగస్తులు ఒత్తిడిని ఎదుర్కొంటారు. చేపట్టిన పనుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికంగా ఖర్చులు చేయడంతో ఆర్ధికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మేలు జరుగుతుంది. మొహమాటాన్నివదిలి సరైన నిర్ణయాల తీసుకుని ముందుకు వెళ్ళాలి. మంచి భవిష్యత్తు లభిస్తుంది.
  12. కుంభ రాశి: ఈ వారంలో ఈరాశి వారు తీసుకునే నిర్ణయాలు పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. ఉద్యోగస్తులకు అన్నింటా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.  పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కాలం సహకరిస్తోంది. ఆలోచనలు ప్రగతివైపు నడిపిస్తాయి. అధికార బలం పెరుగుతుంది. ఆదర్శంగా నిలుస్తారు. బంగారు భవిష్యత్తును ప్రణాళిక బద్ధంగా ముందుకు తీసుకుని వెళ్లారు.
  13. మీన రాశి: ఈ వారం ఈ రాశి వారికి మిశ్రమ కాలం. మానసికంగా బలంగా ఉండాల్సిన సమయం. స్థిర చిత్తంతో ముందుకు అడుగు వేయాల్సిన సమయం. ఉద్యోగాలకు మిశ్రమ కాలం. వృధా వ్యయం చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుని ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది.  అనవసరమైన ఆలోచనకు దూరంగా ఉండడం మంచిది. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ధర్మం కాపాడుతుంది. వారంమధ్యలో ఒక కార్యం సఫలమవుతుంది. ఆపద నుంచి బయటపడతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే