Tirumala: శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు.. ఏపీ 20 ఏళ్లలో దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందన్న ఆర్.కృష్ణయ్య

బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని శ్రీవారిని వేడుకున్నట్లు చెప్పారు కొప్పుల ఈశ్వర్. బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ తిరుమలలో అధిక రద్దీతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

Tirumala: శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు.. ఏపీ 20 ఏళ్లలో దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందన్న ఆర్.కృష్ణయ్య
Mp R. Krishnaiah
Follow us
Surya Kala

|

Updated on: Oct 09, 2022 | 10:37 AM

ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, తెలంగాణ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఉన్నారు. వీరికి ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం తెలంగాణ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని దేశ ప్రజలు ఆదరిస్తే దేశానికే దిక్సూచిగా నిలుస్తుందన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్, రైతు బంధు, దళిత బంధు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ దేశంలో వందశాతం సక్సెస్ అవుతుందని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు కూడా అనేక అవమానాలు ఎదురయ్యాయని సాధించాలనే తపన ఉంటే నాయకులకు ఆలోచనా విధానం, ప్రజలను మెప్పించే సామర్థ్యం ఉంటే ఏ పార్టీ అయినా సక్సెస్ అవుతుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని శ్రీవారిని వేడుకున్నట్లు చెప్పారు కొప్పుల ఈశ్వర్.

బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ తిరుమలలో అధిక రద్దీతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వారి అవస్థలు చూసి వెనుక ఉండే భక్తులకు త్వరగా దర్శనం కావాలనే ఉద్దేశంతో తొందరగా దర్శనం చేసుకుని ఆలయం బయటకు వచ్చామని చెప్పారు. దేశ ప్రజలందరూ సుఖ, శాంతులతో ఉండేలా ఆశీర్వదించాలని స్వామివారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు నారాయణరెడ్డి.

రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ 20 ఏళ్లలో దేశంలోనే కాదు, ప్రపంచంలోనే నెం.1 రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుందన్నారు. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పాలన దేశంలోనే ఆదర్శవంతంగా ఉందన్నారు. పేద వర్గాలు ఎలా అభివృద్ధి చెందుతారో సీఎం జగన్ ఆలోచించి, ఎంతో అనుభవమున్న సంస్కరణవాదిగా, విప్లవవాదిగా బ్రహ్మాండమైన పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. జగన్ ఓట్ల సీఎం కాదు, పేదవర్గాల సీఎం అని పేర్కొన్నారు. సీఎం జగన్ పేద ప్రజలకు అందిస్తున్న విద్యతో భవిష్యత్తులో సబ్సీడీ పథకాలు అవసరం రాదని తెలిపారు. బీసీల సంక్షేమానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారనీ, లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ఏపీలో ఉన్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని తెలిపారు. ఏపీకి మరింత బడ్జెట్ వచ్చేలా చేసి రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ఆశీర్వదించాలని శ్రీవారిని ప్రార్థించానని తెలిపారు. పేద కులాలకు అధికారం, సంపద, బడ్జెట్, విద్యలో వాటా ఇస్తున్న సీఎం జగన్ కు అభినందనలు తెలియజేశారు ఎంపీ కృష్ణయ్య.

ఇవి కూడా చదవండి

Reporter: Anil, Tv9 Telugu

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి..