Palnadu district: అర్థ రూపాయి వడ్డికీ ఆశ పడి..! ఆపై బలవన్మరణాలకు పాల్పడి

ఇతరుల వద్ద తక్కువ వడ్డీకి అప్పు తీసుకుని ఎక్కువ వడ్డీకి కొందరికి ఇచ్చారు. వీరు వడ్డీకి ఇచ్చిన వ్యక్తులు కొందరు డబ్బులు ఎగ్గొట్టారు. దీంతో వ్యవహారం తేడా కొట్టింది.

Palnadu district: అర్థ రూపాయి వడ్డికీ ఆశ పడి..! ఆపై బలవన్మరణాలకు పాల్పడి
Couple Committed Suicide
Follow us

|

Updated on: Oct 09, 2022 | 1:23 PM

పల్నాడు జిల్లా పిడుగురాళ్ళకు చెందిన గోపవరపు వెంకటేశ్వర్లు ధాన్యం వ్యాపారి. గత పాతికేళ్ళుగా రైస్ మిల్లు నిర్వహిస్తున్నాడు. జానపాడు రోడ్డులో పార్టనర్స్ తో కలిసి రైస్ మిల్లును నడుపుతున్నారు. అయితే రూపాయి వడ్డికి పట్టణంలోని పలువురు వద్ద నుండి మూడు కోట్ల రూపాయల రుణం తీసుకున్నాడు. వాటిని రూపాయిన్నర వడ్డికి ఇతర వ్యాపారులకు అప్పుగా ఇచ్చాడు. అర్థ రూపాయి అదనపు వడ్డి కోసం ఆశ పడ్డాడు. రూపాయిన్నర వడ్డికి తీసుకున్న వ్యాపారులు చాలా మంది దివాలా తీశారు. దీంతో మూడు కోట్ల రూపాయలు తిరిగి రాలేదు.

మరోవైపు రైస్ వ్యాపారంలో భాగంగా తమిళ నాడు వ్యాపారులకు నలభై లక్షల రూపాయల విలువైన బియ్యాన్ని అప్పుపై పంపించారు. అవి కూడా వసూలు కాలేదు. వీటికి తోడు రైస్ మిల్లులో 35 లక్షల రూపాయల బియ్యం పాడైపోయి నష్టం వచ్చింది. దీంతో వ్యాపారి వెంకటేశ్వర్లు అప్పుల పాలయ్యాడు. వెంకటేశ్వర్లు కొడుకులు ఇద్దరూ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. నెల క్రితమే వెంకటేశ్వర్లు, అతని భార్య అంజలి కుమారి అమెరికా నుండి తిరిగి వచ్చారు. అప్పటి నుండి అప్పులిచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారు.

శనివారం ఉదయం పని మనిషి ఇంటికి వచ్చి తలుపు కొడితే ఎవరూ తీయలేదు. తలుపులు గట్టిగా నెట్టి ఇంటిలోకి వెళ్ళగా వెంకటేశ్వర్లు ఉరి వేసుకొని తాడుకు వేలాడుతూ కనిపించాడు. పక్కనే ఉన్న మంచంపై అంజని కుమారి విషం కలిపిన అన్నం తిని విగత జీవిగా పడి ఉంది. అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా తాను చనిపోతే తన భార్యను అప్పులిచ్చిన వాళ్లు వేధింపులకు గురి చేస్తారని..  ముందే భార్యకు అన్నంలో పాయిజన్ కలిపి ఇచ్చి ఆమె చనిపోయిన తర్వాత వెంకటేశ్వర్లు ఉరి పెట్టుకుని సూసైడ్ చేసుకొని ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

రిపోర్టర్: టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..