Hindupuram: ప్రభుత్వం స్పందించకపోతే సొంత నిధులతో ఆదుకుంటా.. బాధితులకు బాలయ్య హామి
హిందూపురం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాధితులు అందర్నీ ఆదుకుంటామని తెలిపారు.
సత్యసాయి జిల్లా హిందూపురం వరదల్లో చిక్కుకుంది. కుట్మూరు చెరువు పొంగిపొర్లుతుండడంతో రహదారులు నీటమునిగాయి. వరద ఉధృతితో హిందూపురం నుంచి అనంతపురం కదిరి ప్రాంతాలకు నాలుగురోజులుగా రాకపోకలు తెగిపోయాయి. హిందూపురాన్ని ఆనుకుని ఉన్న చౌడేశ్వరి కాలనీలో జలదిగ్బంధంలో చిక్కుకుంది. రోడ్డుపై చెరువు ప్రవాహం జలపాతాలను తలపిస్తోంది. ఊరిలో జలపాతంలా మారిన చెరువు ప్రవాహాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీసంఖ్యలో చేరుకున్నారు. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా వరదనీటిలో ఉల్లాసంగా గడుపుతున్నారు.
హిందూపురాన్ని వణికిస్తున్న వరదప్రభావిత ప్రాంతాలను సందర్శించారు స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ. హిందూపురానికి చేరుకున్న బాలయ్యకు స్థానిక నేతలు ఘనస్వాగతం పలికారు. నియోజకర్గంలో వరద పరిస్థితిపై నేతలను అడిగి తెలుసుకున్నారు బాలయ్య. పంటల ఎంతమేర డ్యామేజ్ అయ్యాయో వాకబు చేశారు. మోకాల్లోతు వరదనీటిలో నడుస్తూ స్థానికులను పరామర్శిస్తున్నారు. వరదలతో తాము పడతున్న ఇబ్బందులను ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు బాధితులు. తమను ఆదుకోవాలని కోరారు. బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు బాలకృష్ణ. వరద ఉధృతి తగ్గాక.. నష్టపరిహారంపై అధికారులతో అంచనా వేయిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే నియోజకవర్గ ప్రజలను సొంత నిధులతో ఆదుకుంటానని చెప్పారు. అంతేకాదు.. వరదల ముంపు ప్రాంతాలైన చౌడేశ్వరి కాలనీ, త్యాగరాజ నగర్, ఆర్‌టిసీ కాలనీ వాసులకు మంచినీరు, భోజన వసతి కల్పించారు.
(2/2) ఇబ్బందులు పడుతున్నారు అని తెలుసుకున్న శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు వారి అందరికి బోజనం వసతి కల్పించారు.#NandamuriBalakrishna #HindupurMLA
— manabalayya.com? (@manabalayya) October 16, 2022
ఆదివారం కావడంతో వందల సంఖ్యలో వచ్చినవారితో కుట్మూరు చెరువు పరిసరాలు జనసంద్రంగా మారాయి. జలపాతాన్ని తలపిస్తున హిందూపురం వరద ప్రాంతం.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..