Pawan Kalyan: ఏపీని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రాగా ప్రకటించమన్న జనసేనాని.. ఘాటుగా స్పందిస్తున్న వైసీపీ నేతలు..
మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 15న విశాఖ గర్జన పేరుతో రాజకీయేతర జేఏసీ ర్యాలీ చేపట్టనుంది. మరో వైపు సీఎం జగన్‌ను ఉద్దేశించి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పలు ప్రశ్నలు నిన్నటి నుండి ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు.
ఈనెల 15 అంటే వచ్చే శనివారం.. విశాఖపట్నంలో ఏం జరగనుంది? ఒకవైపు వైసిపి మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించ తలపెడితే.. అదే డేట్ నా విశాఖకు పవన్ కళ్యాణ్ వెళ్తున్నట్లు ప్రకటించడంతో పొలిటికల్ సర్కిల్స్ లో.. అక్కడ ఏదో జరగబోతుంది అనే చర్చ నడుస్తుంది. పవన్ స్ట్రాటజీ ఏంటి? ఆ రోజు ఏదైనా హడావుడి చేయబోతున్నారా? అని వార్తలు నేపథ్యంలో ఒక అలెర్ట్ కనిపిస్తుంది.
మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 15న విశాఖ గర్జన పేరుతో రాజకీయేతర జేఏసీ ర్యాలీ చేపట్టనుంది. దానికి తగిన ఏర్పాట్లు చేయడంలో వైసీపీ మంత్రులు నాయకులు తలమునకలై ఉన్నారు. మరో వైపు సీఎం జగన్‌ను ఉద్దేశించి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పలు ప్రశ్నలు నిన్నటి నుండి ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. దేనికీ గర్జనలు అని పదుల ట్వీట్ల తరువాత ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో ఉన్న మౌంట్ రష్మార్ నీ విశాఖపట్నం ఋషికొండకు పోలికిపెట్టిన పవన్ ట్వీట్ చేశారు. మౌంట్ రష్మార్ ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛ-విశ్వాసాలకి చిహ్నం అయితే రుషికొండ పర్వత శ్రేణుల్లో ఉన్న..ఈ “మౌంట్ దిల్ మాంగే మోర్” ధన-వర్గ-కులస్వామ్యానికిబూతులకి చిహ్నం అంటూ ట్వీట్ ఇప్పుడు ట్విట్టర్ వార్ కి మళ్ళీ దారి తీసింది.
… as well declare AP as “United States of Andhra” & announce 25 districts as States & go for 25 capitals. ‘Make AP as your YCP Fiefdom’. And please don’t hesitate, feel free.
— Pawan Kalyan (@PawanKalyan) October 11, 2022
ఆంధ్రప్రదేశ్‌ను కూడా “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర”గా ప్రకటించండి. 25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి 25 రాజధానులకు వెళ్లండి.. ఏపీని మీ వైసీపీ రాజ్యంగా మార్చుకోండి అనే పవన్ ట్వీట్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు. బాబూ కళ్యాణ్ ఏపీ లో 26 జిల్లాలు ఉన్నాయ్ 25 కాదు.. ఇష్టం వచ్చిన “ఫిగర్లు” వద్దు బాబూ ఆంటూ అమర్ సెటైర్ వేశారు.
మూడు రాజధానులకు మద్దతు కూడగట్టాలని వైసీపీ నేతలు ప్రణాళికతో వెళ్తుంటే..పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రలో అదే సమయానికి అక్కడే జనసేనా జనవాణి చేపట్టాలని నిర్ణయం వెనక అసలు కారణం ఏంటి అని జనసేన శ్రేణిని అడిగితే మేము ఎప్పుడో ఈ కార్యక్రమం కోసం ప్రణాళిక వేసుకున్నాం.. వైసిపి ఈ మధ్యనే గర్జనకు పిలుపునిచ్చింది అని పైకి రొటీన్ డైలాగులు తో జనసేన నాయకులు తోసుకొచ్చుతున్నారు. మొత్తానికి 16న జనసేన జనవాణి కార్యక్రమం తరువాత ఉత్తరాంధ్ర జనసేన నేతలతో సమావేశం చూస్తుంటే కచ్చితంగా పవన్ వైసీపీ నిర్ణయాలపై విశాఖ వేదికగా తీవ్రంగానే స్పందిస్తారని అర్థమవుతుంది. అంటే విశాఖ వేదికగా 15 16 17 తేదీలలో పొలిటికల్ హీట్ మరింత హీట్ ఎక్కడం ఖాయం గా కనిపిస్తుంది.
Reporter: Vikram, TV9 Telugu
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..