Love Marriage: ఎల్లలు దాటిన ప్రేమ.. ఆంధ్రా అబ్బాయి.. అమెరికా అమ్మాయి పెళ్లి.. చీరల్లో కనువిందు చేసిన విదేశీ వనితలు

ప్రేమంటే హృదయాన్ని ఇచ్చిపుచ్చుకోవడం కాదు.. నువ్వు లేనప్పుడు నవ్వుని, నువ్వున్నప్పుడు కాలాన్ని పాడేసుకోవడం అని అంటూ ప్రేమ పక్షులు.. వివాహ బంధంతో ఒక్కటయ్యారు అమెరికా అమ్మాయి.. ఆంధ్రా అబ్బాయి.

Love Marriage: ఎల్లలు దాటిన ప్రేమ.. ఆంధ్రా అబ్బాయి.. అమెరికా అమ్మాయి పెళ్లి.. చీరల్లో కనువిందు చేసిన విదేశీ వనితలు
Andhra Boy Married America
Follow us

|

Updated on: Oct 16, 2022 | 6:13 PM

ప్రేమ అంటే జాతి, మతం, కులం, ఉన్నవారు లేనివారు చిన్న పెద్ద అనే అనే బేధాలను చూడడు.. ప్రపంచంలో  ప్రేమించుకునే జంటలకు కొదవే లేదు. ప్రస్తుతం ప్రేమ ఎల్లలు దాటింది.. దేశంకాని దేశానికి చెందిన యువతీయువకులు ప్రేమించుకుంటున్నారు.. పెద్దలను ఒప్పించి తమ ప్రేమను పెళ్లి వరకూ తీసుకుని వెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ప్రేమంటే హృదయాన్ని ఇచ్చిపుచ్చుకోవడం కాదు.. నువ్వు లేనప్పుడు నవ్వుని, నువ్వున్నప్పుడు కాలాన్ని పాడేసుకోవడం అని అంటూ ప్రేమ పక్షులు.. వివాహ బంధంతో ఒక్కటయ్యారు అమెరికా అమ్మాయి.. ఆంధ్రా అబ్బాయి. అమెరికాలో కలిగిన పరిచయం ప్రేమగా మారి పెద్దలను ఒప్పించి భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి చీరాల పట్టణం వేదికగా మారింది. వివరాల్లోకి వెళ్తే..

చీరాలలోని కొత్తపేటకు చెందిన లింగం జాన్‌ సుశీల్‌బాబు, రత్నకుమారి దంపతుల కుమారుడు జాన్ కిరణ్. తన ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. అక్కడే సాప్ట్ వేర్ ఇంజనీర్ గా ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ కిరణ్ కు కొలీగ్ కోరి ఎలిజబెత్‌తో పరిచయం ఏర్పడింది. ఎలిజబెత్ డి అమెరికాలోని ఆరిజోనా స్టేట్‌ హుడ్‌ రివర్‌ పట్టణం. వీరి పరిచయం.. ప్రేమగా మారింది.. అనంతరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో కిరణ్, ఎలిజబెత్ లు ఇద్దరూ తమ తల్లిదండ్రులకు తమ ప్రేమ గురించి చెప్పారు. పెద్దలు వీరి పెళ్ళికి ఒకే చెప్పడంతో .. చీరాలలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్ళిలో అదనపు ఆకర్షణగా పెళ్లి కూతరు మాత్రమే కాదు.. ఆమె కుటుంబ సభ్యులు కూడా చీరలు కట్టుకోవడం. ఎలిజిబెత్ తెల్లని చీరలో కనువిందు చేస్తే.. ఆమె తల్లి ఇతర కుటుంబ సభ్యులు పట్టు చీరలను ధరించి సందడి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..