AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: విశాఖ తీరంలో పొలిటికల్ తుఫాన్.. క్షణక్షణం ఉత్కంఠ.. వరస ట్వీట్లు చేస్తున్న పవన్

ఏపీలో మూడు రాజధానులపై పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. పరస్పరం పర్సనల్‌ లైఫ్‌ని కూడా ఈ అంశంలో లాగేస్తూ.. మరింత వేడి పెంచుతున్నారు నేతలు.

Vizag: విశాఖ తీరంలో పొలిటికల్ తుఫాన్.. క్షణక్షణం ఉత్కంఠ.. వరస ట్వీట్లు చేస్తున్న పవన్
Pawan Kalyan At Vizag
Ram Naramaneni
|

Updated on: Oct 16, 2022 | 5:55 PM

Share

విశాఖ తీరంలో పొలిటికల్‌ కెరటాలు ఎగిసిపడుతున్నాయ్‌. అల్పపీడనంగా ఉన్న పరిస్థితి.. ఏ క్షణమైనా వాయుగుండంగా మారి.. తుఫానులా చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయ్‌. నిన్నటి ఎయిర్‌పోర్టు దగ్గర జరిగిన దాడిఘటనతో చెలరేగిన పొలిటికల్‌ సెగలు ఇంకా చల్లారలేదు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ నగరంలోనే ఉండటంతో… క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది. పవన్‌ బసచేసిన చేసిన హోటెల్‌ వైపు అభిమానులు భారీ సంఖ్యలో దూసుకు రావడంతో… మరింత హైటెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. ఇక, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు… విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రెస్‌ మీట్‌లోనే ఉండగానే అక్కడికి వచ్చిన పోలీసు అధికారులు… నోటీసులు అందజేశారు. వైజాగ్‌ వెస్ట్‌జోన్‌ లిమిట్స్‌లో ఉన్న వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్ దగ్గర.. జనసేన కార్యకకర్తలు చట్టాన్ని ఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేసినట్టు నోటీసులో తెలిపారు పోలీసులు. జనసైనికుల చర్యలతో పలువురికి గాయాలైనట్టు చెప్పారు. జనసేనానితో పాటు పార్టీ నేతలకు కూడా నోటీసులిచ్చారు. విశాఖ పరిధిలో ఎలాంటి ర్యాలీలు, సభలు, రోడ్ షోలు నిర్వహించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

పోలీసులు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్‌ కల్యాణ్‌. ప్రజల కోసం నిలబడితే.. పోలీసు నోటీసుల రూపంలో అవార్డు దక్కిందన్నారు. అయితే, దీనికి వైసీపీ నేతలు అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. జనసేన అసలు పొలిటికల్‌ పార్టీయే కాదనీ.. అదొక సెలబ్రిటీ సంస్థ అంటూ ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల అంశంపై, విశాఖ భూకబ్జా ఆరోపణలపై… నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఎవరి వాదన వారిదే అన్నట్టు… పరస్పర ఆరోపణలతో పరిస్థితిని మరింత హీటెక్కిస్తున్నారు.

ఎయిర్ పోర్ట్ ఘటనపై రెండు రకాల కేసులు

ఎయిర్ పోర్ట్ ఘటనపై రెండు రకాల కేసులు నమోదు చేశారు విశాఖ పోలీసులు. మున్నంగి దిలీప్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసులు నమోదు చేశారు పోలీసులు. మంత్రి రోజాపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో… 12 మందిపై ఐపీసీ సెక్షన్ 147, 148, 149, 341, 307, 324, 325, 427, 188 ఐపీసీ రెడ్ విత్ 34 అండ్ త్రీ కేసులు నమోదయ్యాయి. పోలీసులపై దాడి చేసినందుకు మరో 16మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. పెందుర్తి సిఐ నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో.. సెక్షన్ 332, 427, 147, 148, 149, 34 కేసులు నమోదయ్యాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..