Andhra Pradesh: ఏపీలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ అలెర్ట్.. ఆ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడవచ్చని హెచ్చరిక
ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్రలోని కాపు మంత్రులను జాగ్రత్తగా ఉండాలంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. అర్జీలు ఇచ్చే రూపంలో జనసేన కార్యకర్తలు దాడులకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ విభాగం వార్నింగ్ ఇచ్చింది.
Andhra Pradesh: దాదాపు 19 నెలలకు ముందుగానే ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ వైసీపీ నేతలు, ప్రతి పక్ష పార్టీ జనసేన నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతోంది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న సంఘటలు తారాస్థాయికి తీసుకుని వెళ్లాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలోని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్రలోని కాపు మంత్రులను జాగ్రత్తగా ఉండాలంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. అర్జీలు ఇచ్చే రూపంలో జనసేన కార్యకర్తలు దాడులకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ విభాగం వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా రాష్ట్రంలో 13మంది మంత్రులు, కాపు ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది జాగ్రత్తగా ఉండాలంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు కోరాయి. ఈ మేరకు ఆ మంత్రులు, ఎమ్మెల్యేలను భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశాయి.
ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తం చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల జాబితాలో బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, దాటి శెట్టి రాజా, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, జక్కంపూడి రాజా, పేర్ని నాని, దువ్వాడ శ్రీనివాస్, రోజా లతో పాటు గ్రంధి శ్రీనివాస్ లపై కూడా జనసేన దాడులు చేసే లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కనుక గడప గడప కార్యక్రమంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. సదరు మంత్రులకు, ఎమ్మెల్యేలకు మరింత భద్రతను కట్టుదిట్టం చేసింది. పోలీసులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తలపై జనసేన ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..