Bigg Boss Telugu: ఆర్జే సూర్యకు అదిరిపోయే షాక్‌ ఇచ్చిన ఇనయ.. ఇక దోస్తానా కటీఫ్‌ అంటూ..

ఈ వారం అంతా సర్‌ప్రైజింగ్‌ నామినేషన్స్‌ జరిగాయి. ఫ్రెండ్స్‌, దోస్తానా అనుకున్న అనుకున్నవాళ్లు తమను తామే నామినేట్‌ చేసుకున్నారు. ముఖ్యంగా దోస్తానా అంటూ సూర్యతో ఎంతో కలివిడిగా, సన్నిహితంగా ఉన్న ఇనయ నామినేషన్‌ ప్రక్రియలో అతనికి బిగ్‌ షాక్‌ ఇచ్చింది

Bigg Boss Telugu: ఆర్జే సూర్యకు అదిరిపోయే షాక్‌ ఇచ్చిన ఇనయ.. ఇక దోస్తానా కటీఫ్‌ అంటూ..
Inaya, Surya
Follow us
Basha Shek

|

Updated on: Oct 25, 2022 | 12:56 PM

బిగ్‏బాస్ సీజన్ 6 సీజన్‌ ఏడో వారం పూర్తయింది. ఈ వారం అర్జున్‌ కల్యాణ్‌ హౌజ్‌ నుంచి బయటికొచ్చాడు. ఇక ఎప్పటిలాగే సోమవారం బిగ్‌బాస్‌లో నామినేషన్ల హోరు సాగింది. అయితే ఈ వారం అంతా సర్‌ప్రైజింగ్‌ నామినేషన్స్‌ జరిగాయి. ఫ్రెండ్స్‌, దోస్తానా అనుకున్న అనుకున్నవాళ్లు తమను తామే నామినేట్‌ చేసుకున్నారు. ముఖ్యంగా దోస్తానా అంటూ సూర్యతో ఎంతో కలివిడిగా, సన్నిహితంగా ఉన్న ఇనయ నామినేషన్‌ ప్రక్రియలో అతనికి బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ‘నీకూ, నాకు మధ్య ఏమో ఉందని అందరూ అనుకుంటున్నారు. మన మధ్య స్నేహం మాత్రమే ఉంది. కానీ చాలామందికి అది అర్థ కావట్లేదు. నాగ్‌ సర్‌ కూడా పదే పదే చెబుతున్నప్పుడు మనం క్లోజ్‌గా ఉండటం కరెక్ట్‌ కాదు’ అని సూర్యను నామినేట్‌ చేసింది ఇనయ. దీనికి షాక్‌ అయిన సూర్య ‘బుజ్జమ్మ.. నీది, నాది స్నేహం కంటే ఎక్కువ. మనది ఫ్రెండ్‌ షిప్‌ అని నువ్వే అంటున్నావు. అలాంటప్పుడు అందరూ ఏదో అంటున్నారని మన దోస్తానాను కట్‌ చేస్తానంటున్నావా? అని అడిగాడు . దానికి స్పందించిన ఇనయ ఇప్పటినుంచి నిన్ను కేవలం  బిగ్ బాస్  హౌస్ మేట్ గా మాత్రమే చూస్తానని తెల్చేసింది. దీంతో సూర్య సైలెంట్‌ అయిపోయాడు. అలాగే శ్రీహాన్‌ను కూడా నామినేట్‌ చేసిన ఇనయ ..అందరూ మన గురించి ఏదేదో మాట్లాడుతున్నారు, అది నాకు నచ్చట్లేదని చెప్పుకొచ్చింది.

ఎప్పటిలాగే నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్ల మధ్య మాటల తూటాలు పేలాయి. రేవంత్‌ను అన్న అన్నందుకు నాకు నేను థూ అనుకుంటానంది కీర్తి. అలాగైతే నేను థూథూ అనుకోవాలని గట్టిగా కౌంటరిచ్చాడు రేవంత్‌. ఇక రేవంత్‌ చాలాసార్లు దొంగతనం చేసి తిన్నాడని ఆరోపించింది గీతూ. దీనికి ‘నువ్వే దొంగవి, పెద్ద గొప్ప అని ఫీలైపోకు, నువ్వు నాకు నథింగ్‌’ అంటూ గీతూపై మండిపడ్డాడు రేవంత్‌. ఇక శ్రీసత్య.. సూర్య, మెరీనాలను, ఆదిరెడ్డి.. ఇనయ, మెరీనాలను, గీతూ.. ఇనయ, మెరీనాలను, బాలాదిత్య.. శ్రీసత్య, గీతూలను, కీర్తి.. రేవంత్‌, శ్రీసత్యలను, సూర్య.. ఇనయ, శ్రీసత్యలను, రోహిత్‌.. గీతూ, శ్రీసత్యలను, ఫైమా.. శ్రీసత్య, మెరీనాలను, రాజ్‌.. ఇనయ, రేవంత్‌లను, మెరీనా.. ఫైమా, రాజ్‌లను, రేవంత్‌.. కీర్తి, గీతూలను, వాసంతి.. ఆదిరెడ్డి, సూర్యలను, శ్రీహాన్‌.. మెరీనా, బాలాదిత్యను నామినేట్‌ చేస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి ఎనిమిదవ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన వారిలో బాలాదిత్య, ఆదిరెడ్డి, గీతూ, శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్, మెరీనా, రాజశేఖర్, రోహిత్, వాసంతి ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!