Nikesha Patel: త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న కొమరం పులి హీరోయిన్‌.. ఇన్‌స్టాలో కాబోయే భర్తను పరిచయం చేసిన నికిషా

దీపావళి సందర్భంగా  ఫ్యాన్స్‌కు శుభాకాంక్షలు తెలిపిన నికిషా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది.  తన కాబోయే భర్త, బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫొటోను పంచుకుంంటూ తాను ఓ విదేశీయుడితో ప్రేమలో ఉన్నానంటూ, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు వెల్లడించింది.

Nikesha Patel: త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న కొమరం పులి హీరోయిన్‌.. ఇన్‌స్టాలో కాబోయే భర్తను పరిచయం చేసిన నికిషా
Nikesha Patel
Follow us
Basha Shek

|

Updated on: Oct 25, 2022 | 1:45 PM

2010లో విడుదలైన కొమరం పులి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది గుజరాతీ ముద్దుగుమ్మ నికిషా పటేల్‌. పవర్‌ స్టార్‌ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఆమెకు తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత పలు తమిళ్‌, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. కల్యాణ్‌ రామ్ ఓమ్‌ 3D, అరకు రోడ్‌లో, గుంటూరు టాకీస్‌2 సినిమాల్లో చిన్న పాత్రలు పోషించింది. 2019లో మార్కెట్‌ రాజా ఎంబీబీఎస్‌ అనే సినిమాలో చివరి సారిగా కనిపించిందీ అందాల తార. ఆతర్వాత ఏమైందో కానీ సినిమాలకు పూర్తిగా దూరమైంది. అయితే సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటోంది. నిత్యం తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలను పంచుకుంటోంది. సమయం దొరికినప్పుడు ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూ https://tv9telugu.com/entertainmentఉంటుంది. కాగా దీపావళి సందర్భంగా  ఫ్యాన్స్‌కు శుభాకాంక్షలు తెలిపిన నికిషా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది.  తన  బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫొటోను పంచుకుంంటూ తాను ఓ విదేశీయుడితో ప్రేమలో ఉన్నానంటూ, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు వెల్లడించింది.

కాగా గుజరాత్‌తో పుట్టిన నికిషా ఇంగ్లండ్‌లో పెరిగింది. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసుకుంది. చదువుకుంటూనే మోడలింగ్‌లో అడుగపెట్టి 2006లో మిస్‌ వేల్స్‌ కిరీటం సొంతం చేసుకుంది. ఆతర్వాత కొన్ని టీవీషోల్లోనూ నటించింది. 2010లో కొమరం పులి సినిమాతో సిల్వర్‌ స్ర్కీన్‌పై అడుగుపెట్టింది. ప్రస్తుతం సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉన్న ఈ బ్యూటీ క్వీన్‌ ఈ మధ్య ఇన్ స్టాలో చిట్ చాట్ సందర్భంగా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. తాజాగా  దీపావళి సందర్భంగా తన బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసి షాకిచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆమె బాయ్‌ఫ్రెండ్‌ ఎవరని, ఇద్దరికీ ఎలా పరిచయం మొదలైందంటూ ఫ్యాన్స్ ఆమెను అడుగుతున్నారు. ఇటీవల పవన్‌ విశాఖ పర్యటన నేపథ్యంలో నికిషా షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ తెగ వైరల్‌గా మారింది. పవర్‌స్టార్‌ పెట్టిన ఓ పోస్టుకు ‘నీ వెంటే నేను నడుస్తా’ నంటూ కామెంట్ చేసింది. పవన్ ఫ్యాన్స్ ఈ ట్వీట్ ని రీ ట్వీట్స్ చేస్తూ ట్రెండ్‌ చేశారు. ఇలా

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!