Theater/OTT Movies: ఇక చిన్న సినిమాల జోరు.. ఈ వారం థియేటర్లు/ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లివే
ఈ సారి తెలుగులో చిన్న సినిమాలు భారీగా రిలీజ్ కానున్నాయి. ఇక ఎప్పటిలాగే ఓటీటీలో ఆకట్టుకునే కంటెంట్‌తో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రానున్నాయి. అలా ఈ వారంలో విడుదల కానున్న థియేటర్/ఓటీటీ సినిమాలు, సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.
దసరా, దీపావళి సందడి ముగిసింది. పెద్ద సినిమాలు, బడా హీరోల చిత్రాలు పండగ సెలవులను క్యాష్ చేసుకుంటూ థియేటర్లలో అడుగుపెట్టాయి. అందులో చాలా సినిమాలు ప్రేక్షకుల ముప్పు పొందతే మరికొన్ని అంచనాలు అందుకోలేకపోయాయి. కాగా ఈ వారం చిన్న సినిమాల హోరు వినిపించనుంది. ఎప్పుడో షూటింగ్ అయిపోయిన చిత్రాలు, థియేటర్ల దొరక్క వాయిదా పడుతూ వస్తోన్న మూవీస్ ఇప్పుడు థియేటర్లలోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం చేసుకున్నాయి. ఈ సారి తెలుగులో చిన్న సినిమాలు భారీగా రిలీజ్ కానున్నాయి. ఇక ఎప్పటిలాగే ఓటీటీలో ఆకట్టుకునే కంటెంట్‌తో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రానున్నాయి. అలా ఈ వారంలో విడుదల కానున్న థియేటర్/ఓటీటీ సినిమాలు, సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి. దీపావళి కానుకగా ఈరోజే (అక్టోబర్25)న థియేటర్లలోకి అడుగుపెట్టింది.
రామ్ సేతు
అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సత్యదేవ్ , నుస్రత్ బరూచా రామ్‌సేతు సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ దర్శకత్వం వహిస్తున్నాడు. 7000 ఏళ్ల క్రితంనాటి రామ్ సేతు వారథి రహస్యాలను నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. దీపావళి కానుకగా ఈరోజే (అక్టోబర్ 25)న థియేటర్లలో ఈ సినిమా అడుగుపెట్టింది.
థ్యాంక్‌గాడ్
యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్ర పోషించాడు. ఇంద్రకుమార్ దర్శకత్వం వహించారు. సోషియో ఫాంటసీ డ్రామాతో తెరకెక్కిన ఈసినిమా ఈరోజే విడుదలైంది.
అనుకోని ప్రయాణం
నవ్వుల రారాజు రాజేంద్రప్రసాద్, సీనియర్ నటుడు నరసింహరావు ప్రధాన పాత్రలతో రూపొందించిన చిత్రం అనుకోని ప్రయాణం. ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి వంటి విభిన్నమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు దర్శకుడు వెంకటేశ్ పెద్దిరాల ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అక్టోబర్ 28న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
ఫోకస్
బిగ్‌బాస్ బ్యూటీ అషూరెడ్డి, సీనియర్ నటి సుహాసిని, భానుచందర్ నటిస్తోన్న చిత్రం ఫోకస్. ఓ హత్యానేరం నేపథ్యంలో ఆసక్తికరంగా డైరెక్టర్ సూర్యతేజ ఈ సినిమాను తెరకెక్కించాడు. వినోద్ సంగీతం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 28న థియేటర్లలో అడుగపెట్టనుంది.
ఇవి కాక నిన్నే చూస్తూ, రుద్రవీణ, వెలకమ్ టు తీహార్ కాలేజ్ వంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.
ఓటీటీ సినిమాలు/ సిరీస్‌లివే..
నెట్‌ఫ్లిక్స్
*బ్లేడ్ ఆఫ్ ది 47 రోనిన్ (హాలీవుడ్)- అక్టోబరు 25
*కేబినెట్ ఆఫ్ క్యూరియాసిటీస్ (వెబ్‌సిరీస్)- అక్టోబరు 25
* రాబింగ్ ముస్సోలిని (ఇటాలియాన్ మూవీ)- అక్టోబరు 25
* ద గుడ్ నర్స్ (హాలీవుడ్)- అక్టోబరు 26
* దుబాయ్‌బ్లింగ్ (రియాల్టీ షో)- అక్టోబరు 27
* బియాండ్ ద యూనివర్స్ (హాలీవుడ్)- అక్టోబరు 27
* మర్డర్ ఇన్ ది కోర్ట్ రూమ్ (వెబ్‌సిరీస్)- అక్టోబరు 28
* ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ (హాలీవుడ్)- అక్టోబరు 28
* ద బాస్టర్డ్ ఆన్ అండ్ ద డెవిల్ హిమ్ సెల్ఫ్ (వెబ్‌సిరీస్)- అక్టోబరు 28
అమెజాన్ ప్రైమ్ వీడియో
*నేనే వస్తున్నా (తెలుగు)- అక్టోబరు 27
*ఫ్లేమ్స్ (హిందీ సిరీస్)- అక్టోబరు 28
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
* టేల్స్ ఆఫ్ ది జేడి (వెబ్ సిరీస్)- అక్టోబరు 26
* ఝాన్సీ (తెలుగు సిరీస్)- అక్టోబరు 27
* అప్పన్ (మలయాళం)- అక్టోబరు 28
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.