MS Dhoni: మిస్టర్‌ కూల్‌ మొదటి సినిమాకు ముహూర్తం ఫిక్స్! డైరెక్టర్ ఎవరో తెలుసా?

ఈ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌కు ధోనీ సతీమణి సాక్షి సింగ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించనుంది. అంతేకాదు ఈ బ్యానర్‌పై తెరకెక్కనున్న సినిమాకు కథను కూడా అందించనుంది. రమేష్ తమిళమణి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

MS Dhoni: మిస్టర్‌ కూల్‌ మొదటి సినిమాకు ముహూర్తం ఫిక్స్! డైరెక్టర్ ఎవరో తెలుసా?
Ms Dhoni, Sakshi
Follow us
Basha Shek

|

Updated on: Oct 25, 2022 | 12:18 PM

భారత క్రికెట్‌ జట్టు రూపురేఖలు మార్చిన మిస్టర్‌ కూల్‌ ఎం.ఎస్‌.ధోని ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే డి-ఎంటర్టైన్మెంట్ పేరుతో ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించిన అతను దీపావళి సందర్భంగా తన కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. ఎంఎస్ ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ కింద తమిళంలో తొలి సినిమాను నిర్మించనున్నట్లు తెలిపారు. కాగా ఈ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌కు ధోనీ సతీమణి సాక్షి సింగ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించనుంది. అంతేకాదు ఈ బ్యానర్‌పై తెరకెక్కనున్న సినిమాకు కథను కూడా అందించనుంది. రమేష్ తమిళమణి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. తమిళ్‌తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ‘నేను సాక్షి రాసిన కథను చదివినప్పుడు చాలా స్పెషల్‌గా అనిపించింది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషిచేస్తాను’ అని రమేశ్‌ తెలిపారు. కాగా ఈ సినిమాలో నటించే ఆర్టిస్టులు, క్రూ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.

కాగా తమిళంలో తన తొలి సినిమాను తెరకెక్కించిన తర్వాత తెలుగు, మలయాళంలో వరుసగా ఎంఎస్ ధోనీ సినిమాలను పట్టాలెక్కిస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ఉండొచ్చని చెబుతున్నారు. దీనికోసం ఇప్పటికే మహేష్ బాబును సంప్రదించారని తెలుస్తోంది. ఫ్యామిలీ సినిమాలే కాకుండా సైన్స్‌ ఫిక్షన్‌, క్రైమ్‌, డ్రామా, కామెడీ, సస్పెన్స్‌, థ్రిల్లర్‌ జాంటి జోనర్లలో మంచి సినిమాలు తీసేందుకు వివిధ రచయితలు, డైరెక్టర్లతో చర్చలు జరుగుతున్నట్లు డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. మరి అంతర్జాతీయ క్రికెట్‌లో దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ధోని సినిమా రంగంలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!