AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AUS vs SL, T20 WC Match Preview: వరుస పరాజయాలతో ఆసీస్.. విజయోత్సాహంతో లంక.. కీలకపోరుకు సిద్ధం.. ప్లేయింగ్ XI ఇలా..

AUS vs SL: ఇరు జట్లు ఈరోజు తమ రెండో మ్యాచ్ ఆడనున్నాయి. అంతకుముందు, శ్రీలంక తన మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఓడించగా, ఆతిథ్య ఆస్ట్రేలియా న్యూజిలాండ్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

AUS vs SL, T20 WC Match Preview: వరుస పరాజయాలతో ఆసీస్.. విజయోత్సాహంతో లంక.. కీలకపోరుకు సిద్ధం.. ప్లేయింగ్ XI ఇలా..
AUS vs SL, T20 WC Match Preview
Venkata Chari
|

Updated on: Oct 25, 2022 | 12:55 PM

Share

నేడు (అక్టోబర్ 25) టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంకతో ఆస్ట్రేలియా తలపడనుంది. పెర్త్ స్టేడియంలో సాయంత్రం 4.30 గంటలకు ఇరు జట్లు తలపడనున్నాయి. సూపర్-12 రౌండ్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఆతిథ్య ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఆతిథ్య జట్టు కోరుకుంటోంది. మరోవైపు గెలుపు జోరును కొనసాగించేందుకు శ్రీలంక జట్టు ప్రయత్నిస్తుంది.

ఆస్ట్రేలియా ఆడిన గత నాలుగు టీ20ల్లో ఒక్క విజయం కూడా సాధించక పోవడంతో.. ఆ టీం ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. టీ20 ప్రపంచకప్‌నకు ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మూడో మ్యాచ్‌లో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కానీ, వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఫలితం తేలలేదు. ఆ తర్వాత T20 ప్రపంచ కప్ 2022 సూపర్-12 ప్రారంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కూడా భారీ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో ఆతిథ్య జట్టు ఇప్పుడు విన్నింగ్ ట్రాక్‌కి తిరిగి రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది.

మరోవైపు ఈ టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లోనే నమీబియాపై శ్రీలంక జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత లంక జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఏకపక్షంగా గెలిచింది. అయితే ఈ మూడు మ్యాచ్‌లు అసోసియేట్ జట్లతోనే జరిగాయి. కాగా, ఇటీవల శ్రీలంక జట్టు ఆసియా కప్‌ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో ఈ యువ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది.

ఓడిపోతే ఆస్ట్రేలియా జట్టుకు భారీ నష్టమే..

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోతే సెమీఫైనల్ రేసులో చాలా వెనుకబడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కో గ్రూప్‌లో 6 జట్లు ఉన్నప్పటికీ టాప్-2 జట్లే సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తాయి. ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య టాప్-2 టీమ్‌గా నిలిచేందుకు తీవ్రమైన పోటీ నెలకొంది. న్యూజిలాండ్‌తో ఓడిన తర్వాత ఒక్క మ్యాచ్‌లో ఓడిపోతే ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది.

మీకు తెలుసా?

– శ్రీలంక ఓపెనర్లు గత తొమ్మిది T20Iలలో ఏడు అర్ధ సెంచరీలు సాధించారు. దీంతో జట్టు ఎనిమిది మ్యాచ్‌లను గెలవడంలో కీలకమయ్యారు.

– ఆస్ట్రేలియా గత ప్రపంచ కప్ ప్రారంభం నుంచి 13 వరుస T20Iలను గెలుచుకుంది. కానీ, చివరి నాలుగులో ఛేజింగ్‌లలో మాత్రం ఓడిపోయారు.

– సెప్టెంబర్ చివరి వారం నుంచి, ఆస్ట్రేలియా టీ20 ప్రపంచ కప్‌తో సహా ఫార్మాట్‌లలో ఆరు సిరీస్‌లలో ఆడింది.

ఇరు జట్లు..

ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కీపర్), పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

శ్రీలంక ప్లేయింగ్ XI: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక (కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, బినుర ఫెర్నాండో, లహిరు కుమార

స్క్వాడ్‌లు:

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(సి), మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(w), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్, స్టీవెన్ స్మిత్, అష్టన్ అగర్, కామెరాన్ గ్రీన్ , కేన్ రిచర్డ్సన్

శ్రీలంక జట్టు: కుసాల్ మెండిస్(w), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, అషెన్ బండార, భానుక రాజపక్సే, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, బినుర ఫెర్నాండో, లహిరు కుమార, జెఫ్రీ వాండర్సే, కాస్ వాండర్సే, ప్రమోద్ మదుషన్, పాతుమ్ నిస్సంక