ఒడిశా నుంచి విజయనగరం దిక్కు వస్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా క్యాబేజీ బస్తాల కింద భారీ ఎత్తున గంజాయి బయటపడింది. మొత్తం 123 ప్యాకెట్లలో 650 కిలోల గంజాయి పట్టుబడింది. పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ గంజాయి రవాణా వెనుక ఉన్న మూలాలపై విచారణ జరుగుతోంది.