యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో స్థానిక ఉపాధ్యాయుడు కూరెల్ల ఎల్లయ్య అకస్మాత్తుగా మృతి చెందారు. తండ్రి మరణంతో తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ, ఆయన కుమారుడు హర్షవర్ధన్ పట్టుదలతో పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. తండ్రి ఆశయాలను నెరవేర్చడమే నిజమైన నివాళి అని భావించి, కన్నీళ్లను దిగమింగుకుని పరీక్ష రాసిన హర్షవర్ధన్ ధైర్యం అందరినీ కదిలించింది.